TS EAMCET 2020: ఎంసెట్ హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్‌పై జేఎన్‌టియూ తాజా ప్రకటన

TS EAMCET 2020 Admit cards: హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 లేదా TS EAMCET 2020 కు సంబంధించిన వివరాలు జూన్ 27 విడుదల కావాల్సి ఉండగా..  ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం వేచి చూస్తున్న విద్యార్థుల కోసం జేఎన్టీయూ కీలక ప్రకటన చేసింది.

Last Updated : Jun 26, 2020, 08:40 PM IST
TS EAMCET 2020: ఎంసెట్ హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్‌పై జేఎన్‌టియూ తాజా ప్రకటన

TS EAMCET 2020 Admit cards: హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 లేదా TS EAMCET 2020 కు సంబంధించిన వివరాలు జూన్ 27 విడుదల కావాల్సి ఉండగా..  ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం వేచి చూస్తున్న విద్యార్థుల కోసం జేఎన్టీయూ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌కు చెందిన జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ ( JNTU ) TS EAMCET కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ( TS EAMCET 2020 Hall Tickets ) జూన్ 30 న విడుదల చేయనుంది. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేదీని జూలై 3 గా నిర్ణయించారు. 

జేఎన్‌టియూ అధికారిక వెబ్‌సైట్ విద్యార్థులు తమ TS EAMCET 2020  హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. తెలంగాణ ఎంసెట్ పరీక్షలను ( TS EAMCET 2020 ) తొలుత మే 4 నుంచి జూన్ 11 మధ్యలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్పట్లో అది సాధ్యపడలేదు. దీంతో ఎంసెట్ పరీక్షల తేదీలను మారుస్తూ చివరికి జూలై 6 నుంచి 9వ తేదీకి ఖరారు చేశారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే పరీక్షల తేదీలను మార్చినట్టు యూనివర్సిటీ తెలిపింది. 

రెండు షిఫ్టుల్లో టెస్ట్..

పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఒక టెస్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 మధ్యలో మరో టెస్ట్‌ను నిర్వహించనున్నారు.

సెంటర్లు మార్చుకోవాలంటే...
ఇక పరీక్షా కేంద్రాలను మార్చుకునే వెసులుబాటును కూడా జేఎన్టీయు కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ( TS & AP TEST ZONE ) మధ్య టెస్ట్ జోన్‌లను మార్చుకోవాలి అనుకునే విద్యార్థులు జూన్ 25-26 మధ్యలో సరైన కారణాలు చూపుతూ వెబ్‌సైట్‌లో మార్చుకోవాలి అని సూచించింది.

ఎంసెట్ హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్‌తో పాటు మరిన్ని వివరాల కోసం జేఎన్‌టియూ అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే.

https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx
 

Trending News