హైదరాబాద్: తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలలో 2019-20 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థుల కోసం దరఖాస్తు చివరి తేదిని ఏప్రిల్ 22 వరకు పొడిగించినట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మే 15 నుంచి ప్రారంభం కానున్న పీఈసెట్-2019 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 30 నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాపిరెడ్డి వివరించారు.
ఇప్పటి వరకు పీఈసెట్ కోసం మొత్తం 4,035 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో బీపీఈడీ కోసం 2,186 మంది, యూజీ డీపీఈడీ కోసం 1,869 మంది అభ్యర్థులు ఉన్నారని కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ స్పష్టంచేశారు.