Courses After 10th Class: పదో తరగతి తర్వాత చాలామంది విద్యార్థుల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటర్‌లో చేరాలా.. డిప్లోమా వైపు వెళ్లాలా.. రెండూ కాకుండా త్వరగా ఉపాధి అవకాశాలు దొరికే వొకేషనల్ కోర్సుల్లో చేరితే బాగుంటుందా.. ఇలా అనేక ప్రశ్నలు మనసును తొలుస్తుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విద్యార్థులు తమకు పదో తరగతిలో ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి.. ఏ సబ్జెక్టుల్లో తమకు ఆసక్తి, పట్టు ఉంది.. భవిష్యత్తులో తమ లక్ష్యానికి అవి ఎంతమేర తోడ్పడుతాయి.. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రేపు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల నేపథ్యంలో.. టెన్త్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉండే కోర్సుల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
పదో తరగతి తర్వాత అందుబాటులో ఉండే కోర్సులు :
ఇంటర్మీడియట్ (ప్లస్ 2-XI, XII)
పాలిటెక్నిక్ లేదా డిప్లోమా కోర్సులు
ఐటీఐ కోర్సులు
వొకేషనల్ కోర్సులు
ఇంటర్‌లో చేరితే : ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2లో ప్రధానంగా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కోర్సులు ఉంటాయి. సైన్స్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ విభాగంలో సీఈసీ, హెచ్‌ఈసీ, కామర్స్ విభాగంలో ఎంఈసీ వంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్ వైపు వెళ్లాలనుకునేవారు ఎంపీసీ, మెడిసిన్ వైపు ఆసక్తి ఉంటే బైపీసీ, చార్టెడ్ అకౌంటెంట్ వైపు ఆసక్తి ఉంటే కామర్స్ కోర్సుల్లో చేరుతుంటారు.
పాలిటెక్నిక్ కోర్సులు : మూడేళ్ల కాలపరిమితితో టెక్నికల్, నాన్ టెక్నికల్‌తో పాటు అగ్రికల్చర్ విభాగాల్లో డిప్లోమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈసెట్ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. పాలిటెక్నిక్ పూర్తి చేశాక బీటెక్ లేదా బీఈలో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం ఉంటుంది. టెక్నికల్ విభాగంలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్ తదితర విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉంటాయి. నాన్ టెక్నికల్ విభాగంలో డిప్లోమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం, డిప్లోమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ, డిప్లోమా ఇన్ గార్మెంట్ మాన్యుఫాక్చరింగ్, డిప్లోమా ఇన్ డైరీ టెక్నాలజీ తదితర కోర్సులు ఉంటాయి. అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉంటాయి.
ఐటీఐ కోర్సులు : రెండేళ్ల ఐటీఐ కోర్సులను ప్రభుత్వం ప్లస్ 2కి తత్సమాన కోర్సులుగా గుర్తించింది. ఐటీఐలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. రెండేళ్ల కోర్సు తర్వాత ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. లేదా సొంతంగా ఆయా రంగాల్లో స్వయం ఉపాధికి ప్లాన్ చేసుకోవచ్చు.
వొకేషనల్ కోర్సులు : మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్‌రే టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్, ఆఫీస్ అసిస్టెంట్, డెంటల్ టెక్నిషియన్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. కోర్సును బట్టి వీటి కాల పరిమితి ఆర్నెళ్ల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. ఈ కోర్సులు పూర్తయిన వెంటనే ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
Also Read: EPFO Alert: పీఎఫ్ ఖాతాదారులారా అలర్ట్ అలర్ట్..ఈపీఎఫ్‌వో కీలక హెచ్చరికలు..!
Also Read: Flipkart Best Offers: నేటి నుంచే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 అమ్మకాలు.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.999కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి