ఆర్టీసీ సమ్మె: గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూత

ఆర్టీసీ సమ్మె: గుండెపోటుతో కన్నుమూసిన ఆర్టీసీ డ్రైవర్ సిద్ధగోని రమేష్ గౌడ్

Last Updated : Oct 23, 2019, 02:12 PM IST
ఆర్టీసీ సమ్మె: గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూత

యాచారం: ముషీరాబాద్- 1 డిపోలో డ్రైవర్‌గా పని పనిచేస్తున్న సిద్దగోని రమేష్ గౌడ్ బుధవారం గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ సిద్దగోని రమేష్ గౌడ్ స్వస్థలం. టిఎస్ఆర్టీసీ సమ్మె చేపట్టినప్పటి నుంచి చురుకుగా సమ్మెలో, ధర్నాల్లో పాల్గొంటున్న తమ తోటి కార్మికుడు ఉన్నట్టుండి ఇలా గుండెపోటుతో చనిపోవడం బాధాకరంగా ఉందని సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. 

సిద్ధగోని రమేష్ గౌడ్ హఠాన్మరణంపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పందిస్తూ.. సమస్యల పరిష్కారం కోసం అధైర్యపడకుండా ధైర్యంగా పోరాడి సాధించుకుందాం కానీ ఇలా ధైర్యాన్ని కోల్పోకూడదని సహచర కార్మికులకు విజ్ఞప్తిచేశారు.

Trending News