TSRTC MD Sajjanar orders employees should no longer wear jeans pants and T shirts: మనం ధరించే వస్త్ర ధారణ, మనకు గౌరవం తెచ్చిపేట్టేదిగా ఉండాలి. అందుకే చాలా మంది ఆఫీసులకు, ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు, ఎంతో నీట్ గా బట్టలను ఐరన్ చేసుకుని వెళ్తుంటారు. ఎదుటివారు చూడగానే మొదటగా.. మన అప్పీయరెన్స్ కన్పిస్తుంది. చూడటానికి నీట్ గా కన్పిస్తే, ఫస్ట్ మంచి ఇంప్రెషన్ కల్గుతుంది. బట్టలు నీట్ గా ఉంటే కూడా మనలో ఒకరకమైన కాన్ఫిడెన్స్ లెవల్స్ ఉంటాయి. అందుకే చాలా మంది బట్టలు నీట్ గా వేసుకొవాడానికి ప్రయారిటీ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి మనదేశంలో కొన్ని ప్రభుత్వ శాఖలు తమకంటూ ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ను కల్గిఉన్నాయి. పోలీసులు, డాక్టర్లు, నేవీ, ఆర్మీ, ఆర్టీసీ ఇలా తమకంటూ ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ రంగులను కల్గి ఉంటాయి. ఇదిలా ఉండగా.. మన దేశంలో చాలా మంది బస్సులలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు.
Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
ఈ నేపథ్యంలో బస్సులలో ప్రతిరోజు వేలాది మంది ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి చేరుతుంటారు. అయితే.. తెలంగాణ సర్కారు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. బస్సులో ఉచిత ప్రయాణాలలో అనుకోనిరీతిలో ఆదరణ లభిస్తుంది. కొన్ని రూట్ లలో బస్సుల కొరత వల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. బస్సులలో కొందరు చిల్లర కోసం, ఆర్టీసీ, డ్రైవర్ లతో గొడవలు పడిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. ఇక బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు.
ఇదిలా ఉండగా.. ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులకు జీన్స్ ప్యాంట్, టీషర్ట్ లు వేసుకుని రాకుండా నీట్ గా ఫార్మల్స్ వేసుకుని రావాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. చాలా మంది ఆర్టీసీ సిబ్బంది విధులకు హజరు అయ్యేటప్పుడు.. జీన్స్ ప్యాంట్ లు, టీషర్ట్ లు వంటివి వేసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు డ్రైవర్ లు, కండక్టర్ లు మాత్రం తమ డ్రెస్ కోడ్ ను ఫాలో అవుతున్నారు. ఇక మీదట ప్రతి ఒక్క ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్ లు, కండక్టర్ లతో పాటు, నీట్ గా ఫార్మల్స్ వస్త్రధారణలో రావాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు, ఎంప్లాయిస్ వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్లు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు.. అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుండి ఆర్టీసీ ఉద్యోగులు అందరు ఫార్మల్ డ్రెస్సులోనే ఉద్యోగాలకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter