RTD MD Sajjanar: సజ్జనార్ ను గెలికిన ఎమ్మెల్యే.. వారం తర్వాత మల్టీప్లెక్స్ లో దిమ్మతిరిగే బొమ్మ.. స్టోరీ ఏంటంటే..?

Jeevan reddy mall: ఆర్మూర్ మాజీ  ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ ఘటన ఇప్పుడు తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై అనేక మీడియా వేదికలుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన అంతే రేంజ్ లో గట్టిగా రాడ్ దింపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : May 26, 2024, 08:47 PM IST
  • సీరియస్ అయిన సజ్జనార్..
  • నోటీసులు ఇవ్వకుండా మాల్ స్వాధీనం చేసుకుంటామంటూ ట్విట్..
RTD MD Sajjanar: సజ్జనార్ ను గెలికిన ఎమ్మెల్యే..  వారం తర్వాత  మల్టీప్లెక్స్ లో దిమ్మతిరిగే బొమ్మ.. స్టోరీ ఏంటంటే..?

RTC MD Sajjanar Serious on Jeevan Reddy multiplex mall issue: ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మల్టీ ప్లెక్స్ మాల్ తరచుగా వివాదాల్లో నిలుస్తుంది. ఇటీవల మాల్ ను పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు మాల్ ను సీజ్ చేశారు. దీంతో జీవన్ రెడ్డి  కోర్టుకు వెళ్లి మరీ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు . హైకోర్టు ఆయనకు వారంలోగా.. ఆర్టీసీకి అదే విధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషకు చెల్లించాల్సిన 2.51 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మల్టీ ప్లెక్స్ ను తిరిగి ఓపెన్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి రెచ్చిపోయిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుకూలమైన మీడియాలను పిలిపించుకుని, న్యాయం గెలిచిందన, ఆర్టీసీకి హైకోర్టు మోట్టికాయలు వేసిందంటూ కూడా కామెంట్లు చేశారు. తనను ఎవరు ఏమీ చేయలేరని, అందరి కుట్రలు బైటపెడతానంటూ ఆవేశంతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ పదవికి సజ్జనార్ ఆపోస్టుకు అనర్హుడని కూడా అన్నారు. ఇక సజ్జనార్ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more: Parineeti Chopra: ప్యాంట్ లేకుండా నా పక్కన కూర్చున్నాడు.. హీరో బండారం బైటపెట్టిన పరిణీతి చోప్రా..

సజ్జనార్  అన్యాయాలు బైటపెడతా..

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆ పోస్టుకు పనికిరాడని, అతను నరహంతకుడు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సైబారాబాద్ లో ఉన్నప్పుడు ఆయన కోట్ల రూపాయలను వెనుకేసుకున్నాడని, భూములు బినామిలీ మీద మార్చుకున్నారని కూడా విమర్శించారు. ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘానికి, విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు ఇవ్వడం వల్ల తనపై కోపంతో ఇలా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సజ్జనార్ ను వదిలే ప్రసక్తి లేదని, ఆయను వెంటాడతానంటూ కూడా ఉద్రేకంగా మాట్లాడారు. ఇప్పటి దాక ఆర్టీసీ వాళ్లు ఏడుసార్లు తన మాల్ ను సీజ్ చేశారంటూ, జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్రానికి జీఎస్టీ కట్టని ఆర్టీసీ..

ఆర్టీసీ అధికారులు కేంద్రానికి కట్టాల్సిన జీఎస్టీని కట్టలేదని, తాను ఒక కోటిరూపాయలు కడితే, వెంటనే తనకు 8 లక్షల ఇన్ వాయిస్ జెనరేట్ అవ్వాలని కానీ సజ్జనార్ ఇవన్ని ఎగ్గొట్టాడని అన్నారు. సజ్జనార్ మర్డరర్ అని, రేవంత్ దగ్గర డీజీపీ పదవి కోసం మార్కులు కొట్టేయడానికి తనమీద కుట్రపూరితంగా ఇలా చేస్తున్నాడని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇలాంటివి ఎన్నోచూశానని, న్యాయపోరాటం చేస్తానంటూ కూడా జీవన్ రెడ్డి స్పందించారు. 

ఎక్స్ వేదికగా స్పందించిన సజ్జనార్..

ఇదిలా ఉండగా.. ఆర్మూల్ మాజీ ఎమ్మెల్యే.. ఆర్టీసీకి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వారికి చెల్లించాల్సిన 2.51 కోట్లను  కట్టడానికి కోర్టు వారు వారం గడువు ఇచ్చారు. ఈసారి ఆ డబ్బు కట్టకపోతే.. నోటీసులు ఇవ్వకుండా మల్టీప్లేక్స్ ను స్వాధీనంచేసుకుంటామంటూ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో సజ్జనార్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గా రచ్చ నడుస్తోంది. ఇక విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన ఆ మాల్ లో ఉన్న సబ్ లీజ్ దారులకు నష్టాలు రావోద్దని  కోర్టు వారు వారంపాటు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Read more: Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..

అధికారంను అడ్డుపెట్టుకొని మోసాలు..

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేకు మోసాలకు పాల్పడ్డారని ఆర్మూర్ కాంగ్రెస్ ప్రతినిధి వినయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ లో ఎక్కడ చూసి భూ కబ్జాలకు పాల్పడటం, బాధితులను బెదిరించడం చేస్తుండేవారని చెబుతుంటారు. ఇక తలారీ సత్యం అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కూడా జీవన్ రెడ్డి కారణమంటూ కూడా ఆర్మూర్ లో అనేక మంది చెబుతుంటారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x