Covid-19: ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనా ( coronavirus ) మహమ్మారి రోజురోజుకి చాలా మందికి వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ (Ameenpur) పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Last Updated : Jul 18, 2020, 08:45 PM IST
 Covid-19: ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా

Telangana: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనావైరస్ ( coronavirus ) మహమ్మారి రోజురోజుకి చాలా మందికి వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ (Ameenpur) పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అమీన్‌పూర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన వారంతా కరోనా బారిన పడ్డారు. కుటుంబంలోని ఒక వ్యక్తి నాలుగైదు రోజులుగా తీవ్రమైన గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే వారిది పెద్ద కుటుంబం కావడంతో కుటుంబసభ్యులందరికీ జ్వరాలు వచ్చాయి. Also read: TS Secretariat: జీ బ్లాక్ కింద గుప్తనిధులు: రేవంత్ రెడ్డి

ఈ క్రమంలో కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో శనివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబంలోని 14 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. వారిలో 12 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సుజాత సిబ్బందితో వెళ్లి కాలనీ మొత్తాన్ని శానిటైజ్ చేశారు.  Also read: Notice to Twitter: ట్విటర్‌కి భారత్ నోటీసులు

ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. స్థానికులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇదిలాఉంటే.. ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా సోకిందని తెలియడంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. Also read: Telangana: కరోనాపై ఆందోళన వద్దు: సీఎం కేసీఆర్

Trending News