Vemulawada MLA Chennamaneni Ramesh Babu meets CM KCR: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ( వ్యవసాయ రంగ వ్యవహారాలు) గా తనను నియమించినందుకు వేములవాడ శాసన సభ్యులు డా. చెన్నమనేని రమేశ్ బాబు బుధవారం ప్రగతి భవన్‌కి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆరు దశాబ్దాల వ్యవసాయ సంక్షోభాన్ని , స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో, కేవలం దశాబ్ధికాలంలోపే అధిగమించింది అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా (వ్యవసాయ రంగ వ్యవహారాలు) తనను నియమించినందుకు వేములవాడ శాసనసభ్యులు డా. చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ రమేశ్ బాబు మాట్లాడుతూ వ్యవసాయ… pic.twitter.com/cKm4zobl7Q
— Telangana CMO (@TelanganaCMO) August 30, 2023
సిఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలు, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమేశ్ బాబు తెలిపారు. సిఎం గారి సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమౌతున్న సమయంలో సిఎం కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.