Telangana Floods: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఊహించని స్థాయిలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్ మినహా మిగితా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు అధికారులు. గడ్డెన్న వాగు డ్యాం గేట్లు ఎత్తడంతో నిర్మల్ జిల్లా భైంసా నీట మునిగింది. భారీ వరదలతో నిజామాబాద్ నగరం జలమలమయైంది.
కాశేశ్వం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చించి వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో లక్ష్మీ బ్యారేజీ మొత్తం 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. లక్ష్మీ బ్యారేజీకి ఇన్ ప్లో 4,93,540 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 5,54,660 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. సరస్వతీ బ్యారేజీ. 50 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి భారీగా వరద వస్తోంది. దీంతో డ్యాం
20 గేట్లు లిఫ్ట్ చేశారు అధికారులు. ఎల్లంపల్లి డ్యాంకు ఇన్ ఫ్లో 183192 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 190219 క్యూసెక్కులు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ లోకి వరద పోటెత్తింది. ఎస్సారెస్పీకి ఇన్ ప్లో ఒక లక్ష 54 వేల 446 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూరిస్తాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 48.948టిఎంసీలకు చేరింది. జూలై రెండో వారంలోనే శ్రీరాంసాగర్ లోకి ఈ స్ఠాయిలో వరద రావడం రికార్డ్ అంటున్నారు. కామారెడ్డి జిల్లా మండలం కౌలస్ నాలా ప్రాజెక్ట్ నిండటంతో 2గేట్లను ఎత్తారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్ట్ నిండిపోయింది. వరద గేట్లు ద్వారా 6 వేళ క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి వదిలారు. కొమరం భీమ్ జిల్లా వట్టి వాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. నిర్మల్ జిల్లా భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు 1 గేట్లు ఎత్తి 2100 క్యూసెక్కుల నీటి విడుదలచేశారు. కడెం ప్రాజెక్టుకి వరదపోటెత్తింది. దీంతో డ్యాం 4 గేట్లు ఎత్తి 23197 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలారు. ఆదిలాబాద్ జిల్లా చెనాక-కోరాట బ్యారేజ్ వద్ద ఉదృతంగా ప్రవహిస్తోంది పెన్ గంగా నది. ఇన్ ఫ్లో 36వేల క్యూసెక్కులుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురస్తుండటంతో చెరువులు, సరస్సుల్లోకి వరద నీరు చేరుతోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు నీటి మట్టం 19.6 అడుగులకు చేరింది. ములుగు జిల్లా రామప్ప సరస్సులో నీటిమట్టం 24 అడుగులకు చేరింది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద క్రమ క్రమంగా పెరుగుతోంది నీటి మట్టం.ఆదివారం ఉదయానికి 13.22 మీటర్లకు చేరింది. గోదావరి నది ప్రవాహం పెరగడంతో దిగువ ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు అధికారులు. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి భారీగా వరద నీరు చేరింది. 2,3 గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
24వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కల్గింది.
Read also: HEAVY RAINS:తెలంగాణలో కుంభవృష్ణి.. భూపాలపల్లి జిల్లాలో 323 మిల్లిమీటర్ల వర్షం.. వరదలతో జనం అతలాకుతలం
Read also: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి
Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook