Why KCR Criticising PM Modi: హైదరాబాద్‌లోనే బీజేపీ సమావేశాలు ఎందుకు? మోదీపై కేసీఆర్‌ ఎందుకు ఫైర్ అవుతున్నారు ?

Why KCR Criticising PM Modi: దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపి హైదరాబాద్‌లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహించింది ? బీజేపి నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ వెనుకున్న ప్లానింగ్ ఏంటి ? బీజేపి స్కెచ్ ఏదైనా.. సీఎం కేసీఆర్‌కి ఎందుకు కోపం తెప్పిస్తోంది ?

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 07:19 PM IST
  • హైదరాబాద్‌లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడానికి కారణం ఏంటి ?
  • బీజేపి ఏం స్కెచ్ వేస్తోంది ?
  • బీజేపిపై సీఎం కేసీఆర్‌కి ఎందుకంత కోపం ?
Why KCR Criticising PM Modi: హైదరాబాద్‌లోనే బీజేపీ సమావేశాలు ఎందుకు? మోదీపై కేసీఆర్‌ ఎందుకు ఫైర్ అవుతున్నారు ?

Why KCR Criticising PM Modi: హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తమ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జులై2,3 తేదీలలో నిర్వహించింది. అయితే ప్రతీ సంవత్సరం జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోన్న బీజేపీ ఈసారి హైదరాబాద్‌నే తమ డెస్టినేషన్‌గా ఎంపిక చేసుకోవడానికి వెనుకున్న కారణం ఏంటనేదే చాలామందికి ఆసక్తిరేపుతున్న అంశం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి పవర్‌ఫుల్‌గా ఉన్న బీజేపీకి దక్షిణాదిన సరైన పట్టు లేదు. కర్ణాటకలో బలంగా ఉన్న పార్టీ అంతర్గత సమస్యల వల్ల  ప్రజలకు చేరువ కాలేక పోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో బీజేపీకి పుంజుకునే అవకాశం దక్కడం లేదు. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తులు పెట్టుకున్నప్పటికి పార్టీ క్షేత్రస్థాయిలో బలపడలేకపోయింది. చేసేదేమీలేక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు సిద్ధం అవుతోంది. కానీ ఏపీలో బీజేపీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే మొన్న జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మరోవైపు తమిళనాడులో  అన్నా డీఎంకే  పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓటమి పాలుకావడంతో బీజేపీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లెఫ్ట్ పార్టీలను కాదని అధికారంలోకి వచ్చే అవకాశం లేదని నిరూపితమైంది. 

జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీకి దక్షిణాదిలో పట్టులేకపోవడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా దక్షిణాదిలో పార్టీ బలపడాలని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది.  ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీ బలపడేందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశం తెలంగాణ. ఎందుకంటే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను అవకాశాలుగా మార్చుకుని బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ప్రజల్లోకి వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీని దాటుకుని బీజేపీ ప్రజల్లోకి వెళ్ళింది. కేసీఆర్ ప్రతి వైఫల్యాన్ని అవకాశం దొరికినప్పుడల్లా  బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మరోవైపు నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడంతో క్యాడర్‌ కూడా ఫుల్ జోష్‌లో ఉంది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలుపుతో రాష్ట్ర బీజేపీ నేతల్లో, క్యాడర్‌లో పునరుత్తేజం వచ్చింది. టిఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయ పార్టీ అని ప్రజలను నమ్మించగలిగింది.
 
రాష్ట్ర బీజేపీ నాయకులకు కేంద్ర పెద్దల మద్దతు ఉండడంతో పాటు ప్రతిసారి కేసీఆర్ సర్కారును బీజేపీ ఇరుకున పెడుతోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడిందని టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ భావిస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని అడ్డుకునేందుకు కేంద్రం తెలంగాణ మీద వివక్ష చూపుతోందని టిఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బీజేపీ బలపడడంతో జాతీయ నాయకత్వం కూడా బీజేపీ రాష్ట్ర నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు పిలిచిన ప్రతిసారి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో  బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణను అడ్డంపెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ భావిస్తోంది. అందుకే బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో వరుస పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించింది.

ఒకవేళ తెలంగాణలో బీజేపీ బలపడితే దక్షిణాదిన బీజేపీకి పట్టుదక్కడం ఖాయం. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ మూడో ఫ్రంట్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. ఫ్రంట్ ఏర్పడకపోయిన బీజేపీని దక్షిణాదిన ఎదగకుండా చేయాలని కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. దేశంలో ప్రధాని మోడీ పరిపాలనతో పవర్‌ఫుల్‌గా ఉన్న బీజేపీకి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం కూడా కలిసివచ్చే అంశం. మోడీ చరిష్మాతో రెండు సార్లు గెలిచిన బీజేపీ ఇదే అవకాశంగా దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తోంది. దక్షిణాదిలో పవర్‌ఫుల్‌గా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టి బీజేపీ అధికారంలోకి రావడానికి శత విధాలుగా ప్రయత్నిస్తోంది. భవిష్యత్‌లో దేశానికి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటుందని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఏదేమైనా ప్రాంతీయ పార్టీలను కాదని బీజేపీని ప్రజలు నమ్ముతారో లేదో  వేచిచూడాలి. తెలంగాణలో ఇది అసాధ్యమని చెప్పాలి. కానీ అధికార టిఆర్ఎస్ పార్టీ (TRS Party) మీద ఉన్న వ్యతిరేకతను బీజేపీ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో వేచి చూడాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కాబట్టి ఈలోపు మూడో ఫ్రంట్ ఏర్పడితే బీజేపీకి కొంత గడ్డు పరిస్థితి ఏర్పడక తప్పదు.

Also read : TRS Leaders Changing Party: కారు దిగుతున్న గులాబీ నేతలు.. డేంజర్ జోన్‌లోకి టీఆర్ఎస్ పార్టీ ?

Also read : Revanth Reddy: ఢిల్లీలో టీకాంగ్రెస్ పంచాయితీ.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్! త్వరలో సిరిసిల్లకు రాహుల్ గాంధీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News