Ys Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం కానుంది. ప్రజా సమస్యల్ని ప్రజల ముంగిటే తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర ఇలా కొనసాగనుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ, వైఎఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నకలు, కరోనా మహమ్మారి కారణంగా గతంలో చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నవంబర్ 9వ తేదీన వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి ఆ యాత్రను కొనసాగిస్తున్నట్టు వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు ప్రకటించాయి. తెలంగాణలో పార్టీ స్థాపించిన తరువాత ప్రజా సమస్యలపై తరచూ పోరాడుతూ..ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన పార్టీ. ప్రజల సమస్యల్ని ప్రజల సమక్షంలోనే తెలుసుకునేందుకు చేపట్టిన యాత్రను మార్చ్ 11 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు, సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు అంశాలపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను అస్త్రంగా మల్చుకున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు, 14 పార్లమెంట్ స్థానాల్లో 4 వందల రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు లక్ష్యంగా 2021 ఆగస్టు 20వ తేదీన ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా సమస్యల్ని క్షేత్రస్థాయిలో తెలుసుకుని..పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరిని ఎండగట్టనున్నారు.
Also read: Hindi Talent Test: హిందీ టాలెంట్ టెస్టులో సత్తా చాటిన కోరుట్ల విద్యార్థినులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook