Cobra Snake enters Venkateswara Swamy temple: నాగుపామును నాగదేవతగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. అలాగే నాగు పాము శివుడి మెడలో హారంలా అల్లుకుని ఉంటుంది కనుక నాగు పామును శివుడిగానూ భావించి పూజించే ఆచారం కూడా ఉంది. అలాంటి నాగు పాము శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఇవ్వడం గుడికి వెళ్లిన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Cobra Snake enters Venkateswara Swamy temple : గుడి లోపల నాగుపాము ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా పామును చూసిన భక్తులు తొలుత భయాందోళనకు గురయినప్పటికీ.. ఆ తరువాత అక్కడ కనిపించిన దృశ్యం వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.