KCR REVIEW: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకులాలపైనా ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ రంగాల్లోను ఉద్యోగ శిక్షణ ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.