Viral Video: యోగి ఇలాఖాలో ఘోరం.. నడిరోడ్డు మీద లేడీ కానిస్టేబుల్‌ను అందరి ముందే.. షాకింగ్ వీడియో వైరల్..

Lady constable in moradabad: మొరాదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై  రాజకీయంగా కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 2, 2024, 12:37 PM IST
  • లేడీ కానిస్టేబుల్ పట్ల నీచం..
  • రోడ్డుపైన దారుణానికి పాల్పడిన కామాంధులు..
Viral Video: యోగి ఇలాఖాలో ఘోరం.. నడిరోడ్డు మీద లేడీ కానిస్టేబుల్‌ను అందరి ముందే.. షాకింగ్ వీడియో వైరల్..

Attacks on Female constable in moradabad video viral: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురౌతునే ఉన్నారు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రోలు, వర్క్ ప్లేస్ ఇలా ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు సైతం.. దారుణాలకు పాల్పడుతున్నారు.

Add Zee News as a Preferred Source

చివరకు అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరకు వెళ్తే.. అక్కడ కూడా వేధిస్తు.. అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు అనేకం జరిగాయి. ఈ క్రమంలో సమాజంలో సాధారణ మహిళల భద్రత విషయం కాస్తంత పక్కన పెడితే.. లేడీ పోలీసుల భద్రత కూడా గాలిలో దీపంలా మారిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

 

ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లోషాకింగ్ ఘటన  సంభవించింది. అమ్రీన్ అనే లేడీ కానీస్టేబుల్ రోడ్డు పక్కనుంచి వెళ్తుంది. కొంత మంది ఆకతాయిలు ఆమె దగ్గరకు వెళ్లి బైక్ మీద కూర్చొవాలని వేధించారు. అంతేకాకుండా.. ఆమెతో రోడ్డుమీదనే వాగ్వాదానికి దిగారు. ఆమె ప్రతిఘటించడంతో.. ఆమెపైకి దాడికి దిగారు. నడి రోడ్డు మీదే.. ఆమెమెడను పట్టుకుని, కింద పడేసి మరీ దారుణంగా కోట్టారు.

అక్కడున్న వారు ఇదంతా చూస్తున్నారు.. తప్ప లేడీ కానిస్టేబుల్ ను మాత్రం ఆపడానికి ప్రయత్నం చేయడంలేదు. ఆమెను కొంత మంది పక్కకు ఈడ్చుకెళ్లిదాడికి యత్నించారు.  చివరకు ఆమె కొంత మంది సహాయంలో అక్కడి నుంచి తప్పించుకుని.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. బాధిత లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అక్కడ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా మారిందని తెలుస్తొంది.

Read more: Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..

మరోవైపు  ఈ ఘటన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీనిపై ఫైర్ అయ్యారు. యోగి సర్కారులో.. ఖాకీ దుస్తులు వేసుకున్న వాళ్లకే భద్రతలేదు.. ఇక సామాన్యులకు ఏంభద్రత కల్పిస్తారని కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మొరాదాబాద్ పోలీసులు మాత్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News