PM Modi's Warangal Meeting: 30 సంవత్సరాల తరువాత వరంగల్ గడ్డపైకి దేశ ప్రధాని

PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2023, 05:11 AM IST
PM Modi's Warangal Meeting: 30 సంవత్సరాల తరువాత వరంగల్ గడ్డపైకి దేశ ప్రధాని

PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ఆ ప్రేమను, ప్రజల రుణం తీర్చుకోవడానికి, వరంగల్ అభివృద్ధిలో భాగం పంచుకోవాలి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. ఉత్తర తెలంగాణాలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్లో పార్టీ ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కల్పించడానికి.. నేనున్నా అనే భరోసా కలిపించబోతున్నారు. ఎన్నో సంవత్సరాల కల వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేయబోతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కేవలం 2450 కిలోమీటర్లు హైవే మాత్రమే ఉండగా..  బీజేపీ వచ్చాక ఆ సంఖ్య డబుల్ అయ్యాయి అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. 

ప్రధాని మోదీకి ఈ ప్రాంత ప్రజలు ఘన స్వాగతం పలకాలి అని వినమ్రంగా కొరుతున్నా. సమయానికి రావాలి అని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 9.30 కే వస్తారు. మోదీకీ మేము ఉన్నాం అని ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలు ఇవ్వాలని కోరుతున్నా. బీజేపీని ప్రేమించే ప్రజలు ఇక్కడ ఉన్నారు. మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. మీటింగ్ బాధ్యులను ఏర్పాటు చేశారు. మా పార్టీ యంత్రాంగం ఆ పనిలో నిమగ్నం అయ్యింది. సమయం తక్కువ ఉన్నప్పటికీ.. కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతాం అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు. 

మా మీద గుడ్డి ద్వేషంతో.. వారి కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని కుట్రలు చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు, పేపర్లు, యూట్యూబ్ ఛానళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలారా ఆలోచన చేయండి. BRS ను ఎదురొడ్డి నిలిచిన పార్టీ బీజేపీ. 2019 నుండి బీజేపీ విజయపరంపర మొదలయ్యింది. 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అదే ప్రజలు బీజేపీకి ఇచ్చిన సంకేతం. జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు గెలిచాం. మునుగోడులో కూడా నైతికయం సాధించాం. కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదు అనే విషయం ప్రజలు గుర్తించాలి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.  

బీజేపీ ఎవరితో కలవలేదు... కలవదు... 
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఎగ్జిక్యుటివ్ కమిటీ మీటింగ్లోనే జేపీ నడ్డా, అమిత్ షాలకు తెలంగాణలో గెలిచేందుకు ప్రణాళిక చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసిఆర్ కుటుంబ పాలనను, దోపిడీనీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్లు తప్పించుకోలేరు. దేశంలో ఉన్న స్వార్థపరులు పట్ల మా పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ప్రధాని చెప్పారు. 20 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అక్రమంగా దోచుకున్నారు. అలాంటి వారు గెలిస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం కలుగుతుంది.. అందుకే బీజేపిని ఆదరించండి అని ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పార్టీల గ్రాఫ్ టక్కుమని పెరగడానికి సెన్సెక్స్ కాదు... 
భారతీయ జనతా పార్టీనీ కాపాడుకునే వేలాది మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. చాప కింద నీరులా మా పని కొనసాగుతుంది.. ప్రజాక్షేత్రంలో వెల్లువలా వచ్చి మీకే ఓటు వేస్తామని అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కావాలని సృష్టించే వార్తలు తిప్పి కొట్టండి. ప్రజలు అమాయకులు కాదు. వారిని మభ్య పెట్టలేరు. మాయ చేయలేరు. అప్రమత్తంగా ఉండండి.. నిశితంగా గమనించండి అని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.

బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకొచ్చి నాలుగు ఏళ్ళు పూర్తయినా రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు మీద ఇష్టం లేకనా ? లేక డబ్బులు లేకనా ? అని ప్రశ్నించారు. తనది కాకపోతే ఢిల్లీ దాకా డేక మన్నట్టు.. ఎన్నికల హామీలు ఇస్తున్నారు. తెలంగాణలో పెన్షన్లు, జీతాలు ఇవ్వలేనీ పరిస్థితి ఉంది. అయినా ప్రజల కష్టం తెలిసిన పార్టీగా.. వారికి కావలసినవి చేస్తాం. కేంద్రం అండదండలు ఉంటే అన్నీ చేసే శక్తి ఉంటుంది.. కేసిఆర్ తరహాలో మేము మాట్లాడలేం అంటూ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ చురకలు అంటించారు. 

భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం...

57 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ అందిస్తాం... ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తాం. ఒకవేళ పెన్షన్ మీదనే బతికే కుటుంబం అయితే భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్ అందిస్తాం. ప్రస్తుతం భీమా - 75 లక్షల మందికి ఉంది. తెలంగాణలో 1.05 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణలో ఆ వ్యత్యాసం కూడా లేకుండా అర్హులైన పేద కుటుంబాలకు అందరికీ భీమా సౌకర్యం కల్పిస్తాం. కలిసికట్టుగా కొనసాగుతాం.. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం అని.. అందుకు మీ ఆశీర్వాదమే కావాలని ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Trending News