America: ఆ దేశాక్షుడి వెంట్రుకలకు అంత డిమాండ్ ఎందుకు?

దేవుళ్ల ఆనవాళ్లకే కాదు...చరిత్ర ప్రముఖుల గుర్తులకు కూడా విలువ ఎక్కువే ఉంటుంది. అందుకే ఆ దేశాధ్యక్షుడి తల వెంట్రుకలు కొన్ని అంత ధర పలికాయి.

Last Updated : Sep 14, 2020, 01:22 PM IST
America: ఆ దేశాక్షుడి వెంట్రుకలకు అంత డిమాండ్ ఎందుకు?

మహనీయులు ..బాబాల ఆనవాళ్లకే కాదు...చరిత్ర ప్రముఖుల గుర్తులకు కూడా విలువ ఎక్కువే ఉంటుంది. అందుకే ఆ దేశాధ్యక్షుడి తల వెంట్రుకలు కొన్ని అంత ధర పలికాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ పేరు అందరికీ సుపరిచితమే. అమెరికా చరిత్రలో అత్యధిక ప్రజాదరణ కలిగిన అధ్యక్షుల్లో ఒకరు. జాన్‌ లిక్స్‌ బూత్‌ అనే వ్యక్తి చేతిలో కాల్చి చంపబడిన తర్వాత లింకన్‌కు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహిస్తున్న సందర్భంగా ఐదు సెంటీమీటర్ల పొడవున్న కొన్ని వెంట్రుకలు కత్తిరించి భద్రపరిచారు వైద్యులు. అనంతరం ఈ వెంట్రుకల్ని 1865, ఏప్రిల్‌లో ఓ టెలిగ్రామ్‌ ద్వారా లింకన్‌ సహాయకుడికి పంపారు.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆక్షన్ ఆఫ్ బోస్టన్ అనే సంస్థ ఈ వెంట్రుకలతో పాటు హత్యకు గురైన లింకన్ రక్తపు మరకల్ని వేలంపాట వేసింది. వేలం పాటలో వీటిని 81వేల డాలర్లు అంటే ఇండియన్ మనీలో 60 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాడు ఓ వ్యక్తి. వాస్తవానికి ఇవి గతంలో మాజీ అధ్యక్షుడు లింకన్ కుటుంబసభ్యుల వద్ద భద్రంగా ఉండేవి. 1999లో తొలిసారి వీటిని వేలం వేశారు. వాస్తవానికి ఈ వెంట్రుకలు, టెలిగ్రామ్‌ మాజీ అధ్యక్షుడి కుటుంబసభ్యుల వద్ద భద్రంగా ఉండింది. వీటిని 1999లో మొదటిసారి వేలం వేశారు. Also read: Corona virus: వైరస్ వుహాన్ తయారైందనడానికి ఆధారాలు

 

 

Trending News