Assasination Attempt on Argentina VP Cristina Fernandez: అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌పై హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు క్రిస్టినా ఫెర్నాండెజ్‌ను గన్‌తో పాయింట్ బ్లాక్‌లో కాల్చేందుకు విఫలయత్నం చేశాడు. గన్ పేలకపోవడంతో క్రిస్టినా పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రిస్టినా ఫెర్నాండెజ్ అవినీతి ఆరోపణలపై కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆమె న్యాయ విచారణకు సహకరిస్తున్నారు. అదే సమయంలో క్రిస్టినా ఫెర్నాండెజ్‌కి మద్దతుగా అర్జెంటీనా ప్రజలు ఆమె ఇంటి వద్దకు భారీగా చేరుకుని మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తనకు మద్దతుగా వచ్చిన ప్రజలను కలుసుకుని క్రిస్టినా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుండగా ఆమెపై హత్యాయత్నం జరిగింది.
జనంలో నుంచి ఓ దుండగుడు ఆమెపై గన్ ఎక్కుపెట్టాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆమెపై కాల్పులు జరపబోయాడు. కానీ అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో క్రిస్టినా ఫెర్నాండెజ్ ప్రాణాలతో బయటపడ్డారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని బ్రెజిల్‌కి చెందిన ఫెర్నాండో ఆండ్రే సబగ్ మోంటియెల్ (34)గా గుర్తించారు. అతని గన్‌లో మొత్తం 5 బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు గుర్తించారు. దుండగడు ట్రిగ్గర్ నొక్కిన శబ్ధం తమకు స్పష్టంగా వినిపించిందని.. కానీ బుల్లెట్ పేలలేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
క్రిస్టియానా ఫెర్నాండెజ్ హత్యాయత్నం అర్జెంటీనా ప్రజలను షాక్‌కి గురిచేసింది. అర్జెంటీనాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు, మంత్రులు, ప్రజలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
‼️JUST IN‼️
🇧🇷❌🇦🇷Footage from another angle shows the moment when a Brazilian National named Fernando Andrés Sabag Montiel pulled a gun and tried to assassinate Argentina's left-wing Vice-President Cristina Kirchner
— The gun notoriously failed on the last moment pic.twitter.com/JgmUlNuP2Q
— AZ 🛰🌏🌍🌎 (@AZmilitary1) September 2, 2022
Also Read: Nirmala Seetharaman: జనాల ముందే కలెక్టర్ కు క్లాస్ పీకిన నిర్మల సీతారామన్
Also Read: అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్.. రికార్డులు తిరగరాస్తోన్న 'జల్సా' రీ రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook