AstraZeneca వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి

కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ (AstraZeneca Vaccine) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ టీకా చివరిదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్‌ (clinical trials) ను తాత్కాలికంగా నిలిపివేసి.. మళ్లీ పున:ప్రారంభించారు.

Last Updated : Oct 22, 2020, 08:29 AM IST
AstraZeneca వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి

Brazil's COVID-19 vaccine volunteer dies: న్యూఢిల్లీ: కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ (AstraZeneca Vaccine) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ టీకా చివరిదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్‌ (clinical trials) ను తాత్కాలికంగా నిలిపివేసి.. మళ్లీ పున:ప్రారంభించారు. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. చివరిదశ ప్రయోగాల్లో భాగంగా ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ (Coronavirus vaccine) ను వేయించుకున్న ఓ వాలంటీర్ మరణించినట్లు ( volunteer dies) బ్రెజిల్ ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మరణించాడని బ్రెజిల్ ఆరోగ్య విభాగం తెలిపింది. అయితే చనిపోయిన వాలంటీర్ ఈ టీకా తీసుకోవడం వల్లనే మరణించడా..? లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనేది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. Also read: WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!

ఇదిలాఉంటే.. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్ మాత్రం కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ వల్లనే వాలంటీర్ చనిపోయాడా..? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేదానిపై విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న తరుణంలోనే ఇలా జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇటీవల బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురైన కొన్నిరోజులకే.. బ్రెజిల్లో మరో వ్యక్తి చనిపోవడంతో ప్రయోగాలు నిర్వహిస్తున్న పలుదేశాల్లో ఆందోళన నెలకొంది. Also read: WHO: పది మందిలో ఒకరికి కరోనా.. రాబోయేది మరింత కష్టకాలం!

ఇదిలాఉంటే.. భారత్‌లో డీజీసీఐ ఆదేశాల మేరకు.. ఆస్ట్రాజెనెకా (AstraZeneca-oxford vaccine) వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఫార్మా దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా(SII) సంస్థ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌తో జతకట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News