కరోనా కాస్త తగ్గుముఖం

చైనాను గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' .. కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. వుహాన్‌లో ప్రారంభమై.. అతి కొద్ది కాలంలోనే  చైనా అంతటికి కరోనా వైరస్ విస్తరించింది. దీంతో కరోనా వైరస్ పేరు చెబితేనే గజగజా వణికే పరిస్థితి నెలకొంది.

Last Updated : Feb 20, 2020, 12:30 PM IST
కరోనా కాస్త తగ్గుముఖం

తగ్గుతున్న కరోనా వైరస్..!!
ఊపిరి పీల్చుకుంటున్న చైనా..!! 
నిన్న గణనీయంగా తగ్గిపోయిన పాజిటివ్ కేసులు..!!

చైనాను గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' .. కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. వుహాన్‌లో ప్రారంభమై.. అతి కొద్ది కాలంలోనే  చైనా అంతటికి కరోనా వైరస్ విస్తరించింది. దీంతో కరోనా వైరస్ పేరు చెబితేనే గజగజా వణికే పరిస్థితి నెలకొంది.  ఇప్పటికే 27 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్. . మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న ఒక్క రోజు.. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో చాలా తగ్గింపు కనిపించింది. నిన్న ఒక్క రోజు కేవలం 394 కేసులు మాత్రమే నమోదయ్యాయి.  గత నెల రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఈ ఒక్కరోజే కావడం విశేషం. మొత్తంగా ఇప్పటి వరకు చైనాలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 74 వేల 576కు చేరుకుంది. మరోవైపు నిన్న ఒక్క రోజే 114 మంది కరోనా వైరస్ దెబ్బకు చనిపోయారు. ఒక్క హుబీ ప్రావిన్స్‌లో 108 మంది చనిపోయినట్లు చైనా జాతీయ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

అటు కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగుతున్న వుహాన్ నుంచి భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళానికి చెందిన విమానం ఈ రోజు (గురువారం )చైనాకు వెళ్లాల్సి ఉండింది. కానీ సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ విమాన ప్రయాణాన్ని వాయిదా వేశారు. స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ..  మృతుల సంఖ్య 2వేల 118కి చేరుకోవడం కారణమై ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా భారతీయులను వుహాన్ నుంచి స్వదేశానికి తరలించారు. ఇంకా అక్కడ మిగిలి ఉన్న వారిని తీసుకొచ్చేందుకు  భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. ఐతే కరోనా వైరస్ విజృంభనతో ఇది సాధ్యం కావడం లేదు.

Trending News