జాక్‌సన్‌విల్లె: రన్‌వేపై నుంచి జారిన ఓ బోయింగ్ 737 బోయింగ్ విమానం నేరుగా విమానాశ్రయం పక్కనే వున్న సెయింట్ జాన్ నదిలో పడిపోయిన ఘటన ఫ్లోరిడాలోని జాక్‌సన్‌విల్లెలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సిబ్బంది సహా మొత్తం 136 మంది ప్రయాణికులతో క్యూబా నుంచి జాక్‌సన్‌విల్లెకు వచ్చిన బోయింగ్ విమానం విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్‌వేపై నుంచి జారి నదిలో పడిపోయినట్టు జాక్‌సన్‌విల్లె పోలీసులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తుగా విమానం అడుగుభాగం మాత్రమే నీట మునగడంతో పెను ప్రమాదం తప్పింది.
విమానంలో వున్న ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్టు నగర్ మేయర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఒక విమాన ప్రమాదం మరిచిపోకముందే చోటుచేసుకుంటున్న మరో ప్రమాదం విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.