బీ అలర్ట్.. కరోనా వైరస్‌ను గుర్తించే యాప్ వచ్చేసింది

ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన పడిన వ్యక్తులు మీ సమీపంలో ఉంటే #CloseContactDetectorAPP యాప్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 13, 2020, 08:58 AM IST
బీ అలర్ట్.. కరోనా వైరస్‌ను గుర్తించే యాప్ వచ్చేసింది

చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ప్రాణాంతక వైరస్ కోవిడ్-19  (కరోనా వైరస్). రోజురోజుకు కరోనావైరస్ బాధితుల మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాలకు కరోనా ముప్పు పొంచిఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా సోకినట్లు అనుమానాలుంటే బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా, హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని చైనా ప్రజలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడే ముప్పు పొంచి ఉంటే గుర్తించేందుకు యాప్ రూపొందించారు.

Also Read: బీజేపీ 6 సీట్లు.. ఆప్ 1.. ఇలా కలిసొచ్చిందా?

క్లోజ్ కాంటాక్ట్ డిక్టేటర్ (#CloseContactDetectorAPP) అనే యాప్‌ను చైనా డెవలప్ చేసింది. వైరస్ సోకిన, వైరస్ సోకిందన్న అనుమానిత వ్యక్తులకు సమీపంలో మనం ఉన్నప్పుడు ఆప్ మనని అలర్ట్ చేస్తుంది. స్మోర్ట్ ఫోన్ యూజర్లు ఈ క్లోజ్ కాంటాక్ట్ డిక్టేటర్‌ యాప్‌ను ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ సహాయంతో మీకు దగ్గర్లోని వ్యక్తులకు కోవిడ్-19 (కరోనా వైరస్) లక్షణాలుంటే గుర్తించవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లు క్విక్ రెస్పాన్స్ (QR code) కోడ్ ద్వారా scan చేసి యూజర్లు కరోనా వైరస్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి  

Close contact detector యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లు వారి ఫోన్ నెంబర్‌తో రిజిస్టర్ కావాలి. యూజర్ పేరు, ఐడీ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రతి యూజర్ మరో ముగ్గురు యూజర్ల ఐడీ నెంబర్ల సాయంతో వారి స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. చైనా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్, ప్రభుత్వం సంయుక్తంగా ఈ యాప్ రూపొందించాయని స్థానిక షిన్హువా మీడియా వెల్లడించింది.

Also Read: కరోనా వైరస్‌కు కొత్త పేరు పెట్టిన WHO

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News