విఫలమైన తొలి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ ప్రయోగం

చైనాలో తొలి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ ప్రయోగం విఫలం 

Updated: Oct 28, 2018, 04:13 PM IST
విఫలమైన తొలి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ ప్రయోగం
Source : @CGTNOfficial

చైనాలో తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయోగించిన రాకెట్ మూడో దశలో విఫలమైనట్టుగా బీజింగ్‌కి చెందిన మీడియా సంస్థ ల్యాండ్‌స్కేప్ పేర్కొంది. ప్రయోగం అనంతరం మొదటి రెండు దశల్లో విజయవంతంగానే దూసుకెళ్లిన రాకెట్ మూడో దశలో సాంకేతిక సమస్యలతో విఫలమైనట్టు అక్కడి మీడియా వెల్లడించింది. చైనాకు చెందిన సీసీటీవీ బ్రాడ్‌కాస్టర్ కోసం ఈ ఉపగ్రహం ప్రయోగించినట్టు ల్యాండ్‌స్కేప్ స్పష్టంచేసింది. ఉపగ్రహ ప్రయోగం విఫలమైందనే విషయాన్ని మాత్రమే తమ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా వెల్లడించిన సదరు ప్రైవేట్ సంస్థ.. అంతకుమించిన ఎక్కువ వివరాలను బహిర్గతం చేయలేదు.

సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలన్నీ ప్రభుత్వం తరపున ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు మాత్రమే నిర్వహిస్తుంటాయనే సంగతి తెలిసిందే. అయితే, చైనాలో మాత్రం తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ ZQ-1 అనే రాకెట్‌ని అభివృద్ధి చేసి ప్రయోగించింది కానీ ఆ ప్రయోగంలో విజయాన్ని సాధించలేకపోయింది.