హిందువుల ఆరాధ్య దైవం రాముడి ( Lord Rama ) పై నేపాల్ ప్రదాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. రాముడి జన్మస్థలం ఇండియా కాదని.. నేపాల్ అని చెప్పడమే దీనికి కారణం. ఇప్పటికే రెండుదేశాల మద్య సంబంధాలు చెదురుతున్న నేపధ్యంలో రాముడు తమవాడంటూ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.
ఇండో-చైనా సరిహద్దు వివాద క్రమంలోనే నేపాల్ దేశంతో భారదేశానికి వివాదం ఏర్పడింది. భారత్ లోని భూభాగాల్ని తమ దేశానికి చెందినవిగా చూపిస్తూ కొత్త పటాన్ని విడుదల చేయడంతో భారతదేశం ఆగ్రహం చెందింది. మరోవైపు చైనా ప్రోద్భలంతోనే నేపాల్ భారత్ ను రెచ్చగొడుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ( Nepal Prime minister kp sarma oli ) చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెర తీశాయి. భారత వారసత్వ సంపదగా, హిందూవుల ఆరాధ్య దైవంగా భావించే రాముడు తమ దేశానికి చెందినవాడని...భారత్ కు చెందినవాడు కాదని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సంచలన ప్రకటన చేశారు. రాముడి జన్మస్థలం ఇండియా కాదని..తమ దేశంలోని అయోధ్య గ్రామమని నేపాల్ ప్రదాని ప్రకటించారు. Also read: Corona Virus: ఒక్కరోజులో దాదాపు 2న్నర లక్షల కేసులు
నిజమైన అయోధ్య పశ్చిమ బీర్‌గంజ్ ( West Birgunj ) లోని థోరి ( Thori ) నగరంలో ఉందని..కానీ భారతదేశం తమ దేశంలో జన్మించాడని వాదిస్తోందన్నారు. తరచూ ఇండియా చేసే ప్రకటనల వల్ల తాము కూడా భారతదేశానికి చెందిన రాముడిని సీతాదేవి వివాహం ( Sita got married Lord Rama ) చేసుకుందని నమ్మాల్సివచ్చిందన్నారు. కానీ వాస్తవానికి అయోధ్య ( Ayodhya ) అనేది పశ్చిమ బీర్‌గంజ్ లో ఉందని ఓలి చెప్పారు.
భారతదేశం నకిలీ అయోధ్యను ( Fake Ayodhya ) సృష్టించడం ద్వారా సాంస్కృతిక ఆక్రమణకు పాల్పడిందని కూడా ఆరోపించారు. నిజానికి రాముడు నేపాలీ అని..వాల్మికి ఆశ్రమం ( Balmiki Ashram ) కూడా నేపాల్ లోనే ఉందన్నారు. పుత్రుడి కోసం దశరధ మహారాజు ( King Dasradha ) ఇక్కడే పూజలు నిర్వహించారన్నారు. దశరధుని తనయుడు ఇండియాకు చెందిన రాముడు కాదని. నేపాలీ రాముడని చెప్పారు. ఎటువంటి సమాచార వ్యవస్థ లేని రోజుల్లో అయోధ్య నుంచి జనక్‌పూర్ ( Janakpur ) కు రాముడు వచ్చి సీతను వివాహమాడటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం
నేపాల్ లోని ధనుసా జిల్లా ( Dhanusa District of Nepal ) లో ఉన్న జనక్‌పూర్ సీత జన్మస్థలంగా భావిస్తారనేది తెలిసిందే. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ జనక్‌పూర్ ను సందర్శించి అయోద్యకు నేరుగా బస్సు సేవల్నిప్రారంభించారు. జనక్‌పూర్ ను అభివృద్ది చేయడానికి వంద కోట్ల ప్యాకేజ్ కూడా అప్పట్లో మోదీ ప్రకటించారు.
ఇండో నేపాల్ వివాదం ఎలా ప్రారంభమైంది ?
లిపులేఖ్ ( Lipulekh Road ) ను కలుపుతూ నిర్మించిన 80 కిలోమీటర్ల రోడ్ ను దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింహ్ ( Defence minister Rajnath singh ) ప్రారంభించినప్పటి నుంచి ఇండియా నేపాల్ సంబంధాలపై ప్రభావం పడుతోంది. ఈ రోడ్డును తమ దేశ భూభాగంపై నిర్మించారని నేపాల్ ప్రభుత్వం వాదించింది. ఇందులో భాగంగానే నేపాల్ ఇటీవల భారతదేశ భూభాగాల్ని చేర్చిన మ్యాప్ ను విడుదల చేసింది. అప్పట్నించి రెండు దేశాల మధ్య వివాదం వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాముడిపై చేసిన వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. Also read: Facebook Ban: కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి