Inspiration 4 Streaming:ఎలాన్ మస్క్ కొత్త ప్రయోగం, ఇన్‌స్పిరేషన్ 4 యాత్ర మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లో

Inspiration 4 Streaming: ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఇప్పుడు మరో సంచలనానికి తెరతీశాడు. ఇన్‌స్పిరేషన్ 4 యాత్రతో ప్రైవేటు వ్యక్తుల్ని అంతరిక్షంలో పంపిన ఎలాన్ మస్క్ ఇప్పుడా యాత్రను స్ట్రీమింగ్ చేసే ప్రయోగం చేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2021, 12:36 PM IST
  • మరో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్
  • ఇన్ స్పిరేషన్ 4 యాత్రను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్న ఎలాన్ మస్క్
  • సిబ్బంది ట్రైనింగ్ నుంచి ప్రయోగం వరకూ ఆరు ఎపిసోడ్లలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం
Inspiration 4 Streaming:ఎలాన్ మస్క్ కొత్త ప్రయోగం, ఇన్‌స్పిరేషన్ 4 యాత్ర మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లో

Inspiration 4 Streaming: ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఇప్పుడు మరో సంచలనానికి తెరతీశాడు. ఇన్‌స్పిరేషన్ 4 యాత్రతో ప్రైవేటు వ్యక్తుల్ని అంతరిక్షంలో పంపిన ఎలాన్ మస్క్ ఇప్పుడా యాత్రను స్ట్రీమింగ్ చేసే ప్రయోగం చేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాం.

ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్(SpaceX), టెస్లా కంపెనీ(Tesla)అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే అంతరిక్షంలో తనదైన మార్క్ చూపించాడు. రాకెట్లకు వినియోగించే బూస్టర్లను తిరిగి వాడవచ్చని ఫాల్కన్ రాకెట్ ప్రయోగంతో నిరూపించిన ఘనత ఎలాన్ మస్క్‌దే. దీనిద్వారా రాకెట్ ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించగలిగాడు. ఇన్‌స్పిరేషన్ 4 యాత్రతో నలుగురు సాధారణ వ్యక్తుల్ని రోదసీలో విజయవంతంగా పంపి..అంతరిక్షంలో పర్యాటకానికి తెరతీశాడు. యాధృచ్ఛికమో లేదా ఆ ప్రభావమో గానీ అప్పట్నించీ ఎలాన్ మస్క్(Elon Musk) కంపెనీ షేర్లు కూడా గణనీయంగా పెరిగాయి. ఇప్పుడీ యాత్ర ఆధారంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 

ప్రపంచమంతా చర్చనీయాంశమైన ఇన్‌స్పిరేషన్ 4 లాంచ్ ప్రయోగాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ (Inspiration4 on Netflix Streaming)చేశారు. ఇన్‌స్పిరేషన్ 4 యాత్ర పూర్తి ప్రయోగాన్ని సిబ్బంది ట్రైనింగ్ నుంచి ల్యాండింగ్ వరకూ ఆరు ఎపిసోడ్స్‌లో నెట్‌ఫ్లిక్స్(Netflix)స్ట్రీమ్ చేస్తోంది. ఇలాంటి ప్రయోగాల వల్ల అంతరిక్షయాత్రల పట్ల మరింత అవగాహన వస్తుందంటున్నారు ఎలాన్ మస్క్. ఇన్‌స్పిరేషన్ 4 యాత్ర(Inspiration 4)ద్వారా నలుగురు ప్రైవేటు వ్యక్తుల్ని రోదసీలో నాలుగురోజుల పాటు తిప్పి..క్షేమంగా తిరిగి ల్యాండ్ చేయడం ద్వారా ఎలాన్ మస్క్ సక్సెస్ సాధించారు. ఇప్పుడీ ప్రయోగమే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

Also read: UNO On Gandhi Jayanti: మహాత్ముడిని గుర్తు చేసుకున్న ఐక్యరాజ్యసమితి, గాంధీ స్ఫూర్తి అవసరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News