Pfizer antiviral pill: దాదాపు రెండేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ ఫార్మా కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన టీకాను (Corona Vaccine) అభివృద్ధి చేశాయి. ఇంకా కొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయినప్పటికీ కరోనా సోకిన వారిలో కొంత మంది తీవ్ర అనారోగ్యంపాలై మృత్యువాత (Corona Deaths) పడుతున్నారు.
అయితే కరోనా సోకిన వారిలో మరణాల శాతాన్ని తగ్గించే విధంగా అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ ఫైజర్ ఓ ఔషధాన్ని (Pfizer Corona Drug) అభివృద్ధి చేసింది.
మాత్రల రూపంలో తీసుకులనేలా అభివృద్ధి చేసిన ఈ ఔషధంపై (Pfizer Antiviral pill) ఇటీవల పరీక్షలు నిర్వహించగా.. అద్భుతమైన ఫలితాలను సాధించినట్లు ఫైజర్ వెల్లడించింది.
Also read: Australia Covaxin Approval: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక గుర్తింపు
Also read: COVID-19: ఆ దేశాల్లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ కల్లోలం, మనదేశంలో కాస్త తక్కువే
పరీక్ష ఫలితాలు ఇలా..
1200 మందికిపైగా చేసిన పరీక్షల ఆధారంగా.. ఈ ఫలితాలను వెల్లడించింది ఫైజర్. పరీక్షల్లో పాల్గొన్న వారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలున్న బాధితులు, వృద్దులు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
'కరోనా లక్షణాలను గుర్తించిన వారంలోపే ఈ ఔషధాన్ని ఇవ్వడం ప్రారంబించారు. ఈ ఔషధం తీసుకున్న వారిలో 0.8 శాతం మంతి మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు నెల రోజుల్లో ఎవరూ మరణించలేదు. అయితే ప్లాసిబో (ఔషధం లేని మాత్ర) తీసుకున్న వారిలో 7 శాతం మంది ఆస్పత్రిలో చేరగా.. అందులో ఏడుగురు మరణించారు. దీనితో ఈ మాత్రల వల్ల మరణాలు తగ్గే అవకాశం 89 శాతంగా లెక్కించారు పరిశోధకులు.' అని ఫైజర్ పేర్కొంది.
త్వరలోనే ఔషధ నియంత్రణ సంస్థలకూ ఈ ఫలితాల వివరాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. పాక్స్‌లోవిడ్ (Pfizer Paxlovid) బ్రాండ్ పేరుతో ఈ యాంటీవైరల్ ఔషధాన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.
Also read: UK COVID prevalence 1 in 50: బ్రిటన్‌లో ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా
Aslo read: Vaccine For Kids: చిన్నారుల కరోనా టీకాకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం- 5-11 ఏళ్ల వారికి ఇచ్చేందుకు కసరత్తు!
ఇది కాంబినేషన్ ఔషధం..
కొత్తగా అభివృద్ధి చేసిన మాత్ర కాంబినేషన్ ఔషధం అని ఫైజర్ వెల్లడించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైటోనవిర్‌తో కలిపి దీనిని తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మూడు మాత్రల్లో లభించే ఈ ఔషధాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. 20 శాతం బాధితుల్లో మాత్రమే దుష్ప్రభావాలు కనిపించినట్లు చెప్పింది.
కరోనా చికిత్స కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సూది మందును ఎక్కువగా వినియోగిస్తున్నారు. బ్రిటన్‌లో మోల్నుపిరవిర్ పేరుతో మెర్క్ (Merc Corona Pill) తీసుకొచ్చిన మాత్రకు బ్రిటన్ ఇటీవలే ఆమోదం తెలిపింది.
Also read: Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది
Also read: China Lockdown: 'నిత్యవసరాలు స్టాక్ పెట్టుకోండి' - ప్రజలకు చైనా ప్రభుత్వం హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Pfizer antiviral pill: కరోనాతో మరణం ముప్పును 89 శాతం తగ్గిస్తున్న ఫైజర్ ఔషధం!
కరోనా చికిత్సకు ఫైజర్ కొత్త ఔషధం
మరణావకాశాలను భారీగా తగ్గిస్తున్నట్లు వెల్లడి
త్వరలోనే నియంత్రణ సంస్థల దృష్టికి పరీక్ష ఫలితాల వివరాలు