Philippines typhoon: ఫిలిప్పీన్స్‌ను రాయ్ తుపాన్(Rai Typhoon) అతలాకుతలం చేసింది. మృతుల సంఖ్య 208కి చేరింది. ఒక్క బోహోల్ రాష్ట్రంలోనే 100కి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ తుపాను ఫిలిప్పీన్స్(Philippines)ను అంధకారంలోకి నెట్టింది. కోలుకోలేని స్థితికి చేర్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం చూపించింది.
ఈ తుపాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసమయ్యింది. సమచార, రవాణ స్తంభించి పోయింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రొడ్రిగో డుటెర్టే(Rodrigo Duterte) దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు. 2 బిలియన్ పెసోస్(40 మిలియన్ డాలర్లు) సాయం ప్రకటించారు.
Also Read: Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్‌లో 'రాయ్' బీభత్సం- 100 దాటిన మృతుల సంఖ్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook