శ్రీలంక వరుస పేలుళ్లు: 290కి చేరిన మృతుల సంఖ్య, మృతుల్లో ఆరుగురు భారతీయులు

మృతిచెందిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారని శ్రీలంక అధికారులు వెల్లడించినట్టుగా పిటిఐ తాజా కథనం పేర్కొంది.  

Last Updated : Apr 22, 2019, 10:49 AM IST
శ్రీలంక వరుస పేలుళ్లు: 290కి చేరిన మృతుల సంఖ్య, మృతుల్లో ఆరుగురు భారతీయులు

కొలంబొ: శ్రీలంకలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూవస్తోంది. ఆదివారం రాత్రి కడపటి వార్తలు అందే సమయానికి 215గా వున్న ఈ సంఖ్య సోమవారం నాటికి 290కి చేరింది. ఈ వరుస పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన 500పైగా మందిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్న అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మృతిచెందిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారని శ్రీలంక అధికారులు వెల్లడించినట్టుగా పిటిఐ తాజా కథనం పేర్కొంది.  

వరుస పేలుళ్ల అనంతరం శ్రీలంకలో దేశవ్యాప్తంగా ఆదివారం విధించిన కర్ఫ్యూను సోమవారం ఉదయం 6 గంటలకు ఎత్తేశారు. కొలంబో విమానాశ్రయం సమీపంలోనూ ఓ ఐఇడి బాంబును శ్రీలంక భద్రతా బలగాలు నిర్విర్యం చేశాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు సైతం సెలవు ప్రకటించారు.

Trending News