Good News: కరోనావైరస్ బలహీనపడుతోందట!

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం చాలా ఇబ్బంది పడుతోంది. 

Last Updated : Oct 3, 2020, 07:45 PM IST
    • కరోనావైరస్ వల్ల ప్రపంచం మొత్తం చాలా ఇబ్బంది పడుతోంది.
    • కోట్లాది మందికి ఈ వైరస్ సోకగా లక్షలాది మంది మరణించారు. భారత దేశంలోనే లక్షకు పైగా మరణాలు నమోదు అయ్యాయి.
    • అయితే టీకా వచ్చేస్తుంది అని ఆశలో చాలా మంది ఉన్నా...ఇప్పట్లో వచ్చేలా లేదు అని స్పష్టం అవుతోంది.
Good News: కరోనావైరస్ బలహీనపడుతోందట!

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం మొత్తం చాలా ఇబ్బంది పడుతోంది. కోట్లాది మందికి ఈ వైరస్ సోకగా లక్షలాది మంది మరణించారు. భారత దేశంలోనే ( India ) లక్షకు పైగా మరణాలు నమోదు అయ్యాయి. అయితే టీకా వచ్చేస్తుంది అని ఆశలో చాలా మంది ఉన్నా...ఇప్పట్లో వచ్చేలా లేదు అని స్పష్టం అవుతోంది.

ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు

రష్యాకు ( Russia ) చెందిన వ్యాక్సిన్ మూడో ట్రయల్ పూర్తి చేయకుండానే జనాల్లోకి వెళ్లిపోయింది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) మాత్రం దాన్ని అధికారికంగా వ్యాక్సిన్ గా ప్రకటించలేదు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఖంగారు పడుతున్నారు. ఈ సమయంలో అమెరికా పరిశోధకులు శుభవార్త తెలిపారు.

కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) మెల్లిమెల్లిగా బలహీన పడుతోంది అని తెలిపారు డెట్రాయిట్ కు చెందిన శాస్త్రవేత్తలు. అక్కడ  ఒక మెడికల్ సెంటర్ లో 700 మంది నుంచి తీసుకున్న శాంపిల్స్ ఆధారంగా వైద్యులు ఈ విషయం తెలిపారు. తొలి వారంలో తీసుకున్న వైరస్ లో అధికంగా వైరస్ లోడ్ ఉన్నట్టు తెలిపారు. అందులో 14 మంది మరణించారని తెలిపారు.

ALSO READ| N-95 Mask: ఎన్ 95 మాస్కును ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఇలా క్లీన్ చేయోచ్చు

అయితే ఐదో వారం వారు తీసుకున్న నమూనాల్లో 70 శాతం వైరస్ లోడ్ తక్కువగా ఉన్నట్టు చెప్పారు. దీంతో వైరస్ ప్రభావం తగ్గుతోంది అని అంటున్నారు పరిశోధకులు. అయితే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి అని.. వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తలు తప్పవు అని అంటున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News