వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదంలోకి చిక్కుకున్నాడు. ఈ సారి అమర జవాన్లకు చులకనగా మాట్లాడుతూ రెడ్ హ్యాడెండ్ గా పట్టుబడ్డాడు. వివారల్లో వెళ్లినట్లయితే .. ఇటీవల ఆఫ్రికాలోని నైజర్ దేశంలో అక్టోబర్ 4న జరిగిన దాడుల్లో అమెరికాకు చెందిన నలుగురు సైనికాధికారులు మృతి చెందారు. వారిలో సర్జెంట్ డేవిడ్ టి.జాన్సన్ ఒకరు.
ఈ దాడిలో అమరవీరులైన అధికారుల కుటుంబాలను ట్రంప్ ఫోన్లో పరామర్శించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ జాన్సన్ భార్య మెయ్‌షియాకి ఫోన్ చేసి అవమానకరంగా మాట్లాడారు. ఈ విషయాన్ని జాన్సన్ తల్లి కోవాండా మీడియా ద్వారా వెల్లడించారు.
ట్రంప్ తన కుమారుడితో పాటు తన భర్తను, కూతుర్ని కూడా అవమానించారని కొవాండా ఆరోపించారు. అసలు తన కుమారుడి పేరు కూడా ట్రంప్‌కు తెలియదన్నారు. ట్రంప్ తన భర్త పేరు తెలియదనడంతో తనకు ఏడుపొచ్చేసిందని మెయ్‌షియా ఉద్వేగానికి లోనయ్యారు. కాగా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను అలా ప్రవర్తించేలేదనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.