అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారిణిగా చేస్తున్న హోప్ హిక్సుకు కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడింది. లక్షణాలు రావడంతో టెస్టులు చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ దంపతులలో కంగారు మొదలైంది.
Also read : Health Tips: ఎక్సర్‌సైజ్ ఎక్కువగా చేస్తున్నారా.. ఈ సమస్యలు తెలుసుకోండి
డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లు కోవిడ్19 టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి తామిద్దరం క్వారంటైన్‌లోకి వెళ్లామని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు. ట్రంప్ డిబేట్‌లో పాల్గొనేందుకు ఆయనతో కలిసి సలహాదారిణి హోప్ హిక్సు మంగళవారం ఎయిర్ ఫోర్సు వన్ విమానంలో ప్రయాణించారు. ఆమెకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలలో పాజిటివ్ రావడంతో ట్రంప్ దంపతులు సైతం కోవిడ్19 టెస్టులకు వెళ్లారు.
Also Read: CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!
Hope Hicks, who has been working so hard without even taking a small break, has just tested positive for Covid 19. Terrible! The First Lady and I are waiting for our test results. In the meantime, we will begin our quarantine process!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe