ఈ శతాబ్ధపు అద్భుతం: ఈనెలలో విశ్వంలో రెండు ఖగోళ వింతలు

ఖగోళ రహస్యాలు, వింతలపై ఆసక్తి చూపే వారికి ఇది శుభవార్త.

Last Updated : Jul 9, 2018, 05:23 PM IST
ఈ శతాబ్ధపు అద్భుతం: ఈనెలలో విశ్వంలో రెండు ఖగోళ వింతలు

ఖగోళ రహస్యాలు, వింతలపై ఆసక్తి చూపే వారికి ఇది శుభవార్త. ఈనెలలో అంతరిక్షంలో రెండు ఖగోళ వింతలు కనువిందు చేయనున్నాయి. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం (1.43 గంటల పాటు) ఈనెల 27న కనువిందు చేయనుంది. భారత్‌లో రాత్రి 11.54 గంటల తర్వాత ఈ అద్భుతం కనిపిస్తుంది. ఈ వింతను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వీక్షించొచ్చు.

ఈ నెల 31న అంగారక గ్రహం భూమికి అత్యంత సమీపంగా రానుంది. ఈ సమయంలో రెండు గ్రహాల మధ్య దూరం 5.76 కోట్ల కిలోమీటర్ల మేర ఉంటుంది. 2003 తర్వాత అంగారకుడు భూమికి ఇంత చేరువగా రావడం ఇదే తొలిసారి. 2003లో 5.57 కోట్ల కి.మీల చేరువలో వచ్చింది. మళ్లీ 2035లో ఈ గ్రహం భూమికి దగ్గరగా రానుంది. ఈనెల 31న సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఎలాంటి టెలిస్కోప్ సహాయం లేకుండా కంటితోనే అంగారకుడిని వీక్షించవచ్చట. సూర్యాస్తమయం తర్వాత తూర్పు-ఆగ్నేయ దిశలో ఈ  గ్రహం కనపడుతుందన్నారు నిపుణులు.  టెలిస్కోపుతో చూస్తే అంగారక గ్రహంపైనున్న మంచు ఫలకాలనూ చూడొచ్చని చెప్పారు కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు.

 

Trending News