Former Pakistan Pm Imran Khan Second wife Reham Khan Third Marriage with Mirza Bilal Baig: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ రెండో భార్య, బీబీసీ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని రెహమ్ స్వయంగా శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 49 ఏళ్ల రెహమ్ ఖాన్ అమెరికాలోని సియాటిల్‌లో 36 ఏళ్ల మోడల్ అయిన మీర్జా బిలాల్‌ను వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత సోషల్ మీడియా ప్రకటించిన పోస్ట్‌లో రెహమ్ మాట్లాడుతూ చివరకు, నేను విశ్వసించే వ్యక్తిని కనుగొన్నాను అంటూ ఒక పోస్ట్‌తో కూడిన ఫోటోను రెహమ్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో వివాహాన్ని నిర్వహించే ఖాజీతో పాటు రెహమ్ మరియు మీర్జా బిలాల్ కనిపిస్తున్నారు. ఇక అంతేకాక రెహమ్ మాట్లాడుతూ సియాటిల్‌లో నికాహ్ వేడుకలు అద్భుతంగా జరిగాయని అన్నారు. ఇక ఈ సమయంలో బిలాల్, మా తల్లిదండ్రులు మరియు నా కొడుకు పెళ్లి పెద్దలుగా ఉన్నారని అన్నారు.
బిలాల్ పాకిస్తాన్ మూలాలు ఉన్న ఒక అమెరికన్ పౌరుడు. మోడలింగ్‌తో పాటు ఆయన యాక్టింగ్ కూడా చేస్తున్నారు. అంతేకాక ఆయనకు ఒక కార్పొరేట్ కంపెనీ కూడా ఉంది. అలాగే 4 మ్యాన్ షో, దిల్ పే మత్ లే యార్ వంటి టీవీ షోలలో కూడా కనిపించాడు. ఇవి కాకుండా ఆయన అమెరికన్ టీవీ షో నేషనల్ ఏలియన్ బ్రాడ్‌కాస్ట్‌లో కూడా కనిపించాడు. బిలాల్ కూడా ఇంతకు ముందు రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఒక బిడ్డ ఉన్నారు.
రెహమ్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెహమ్ కొన్ని రోజుల క్రితం తాను మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ టీవీ షోలో హింట్ ఇచ్చింది. తన రెండు వివాహాలు విఫలమయ్యాయని అయితే ఇప్పుడు నేను అత్యంత నమ్మదగిన వ్యక్తిని కనుగొన్నానని ఆమె పేర్కొంది. రెహమ్ పెషావర్ జిన్నా కాలేజీలో చదువుకుని జర్నలిస్టుగా మారింది. 1993లో ఆమె తన బంధువు జర్నలిస్ట్ అయిన ఒక ఈజాజ్ ను వివాహమాడింది.
ఆ తరువాత 2005లో ఈజాజ్‌తో విడాకులు తీసుకుంది. ఈ వివాహంలో రెహమ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో, రెహమ్ BBCలో పని చేసేవారు. ఆ తరువాత రెహమ్ 6 జనవరి 2015న ఇమ్రాన్ ఖాన్‌ను రెండో వివాహం చేసుకుంది. ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లే. అయితే దాదాపు 9 నెలల తర్వాత, 30 అక్టోబర్ 2015న, ఇమ్రాన్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. రెహమ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఇమ్రాన్ బుష్రా బీబీను మూడో పెళ్లి చేసుకున్నాడు.
Also Read: Shraddha Murder Case: శ్రద్ద మర్డర్ కేసులో కీలక పురోగతి.. పోలీసుల చేతికి రిపోర్ట్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.