Google Layoffs: జీతభత్యాలు పెంచమన్న పాపానికి ఉద్యోగుల ఉద్వాసన

Google Layoffs: ప్రపంచంలో అతిపెద్ద టెక్ సంస్థ గూగుల్ అంటే ఉద్యోగుల సౌకర్యాలు, జీతాలకు పెట్టింది పేరుగా చెబుతారు. వాస్తవం కూడా అదే. గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులకు ఉండే సౌకర్యాలు మరెక్కడా ఉండకపోవచ్చు. కానీ అదే గూగుల్ సంస్థ ఇప్పుడు ఆ ఉద్యోగులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2024, 05:19 PM IST
Google Layoffs: జీతభత్యాలు పెంచమన్న పాపానికి ఉద్యోగుల ఉద్వాసన

Google Layoffs: ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఆ ఉద్యోగులపై కొరడా ఝులిపించింది. ఏకంగా 43 మందిని ఒక్క వేటుతో పీకిపారేసింది. ఎందుకో కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ ఉద్యోగులు చేసిన పాపం ఒక్కటే..జీతాలు పెంచమని అడగడం. అంతమాత్రానికే పీకేస్తారా అంటే అవును..అదే చేసింది గూగుల్ సంస్థ. ఈ 43 మందిని గూగుల్ కోసం మరో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ నియమించుకుంది. అంతేకాకుండా ఇదంతా కాగ్నిజెంట్ సంస్థే చేసిందని స్పష్టం చేసింది. 

గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ కోసం పనిచేసేందుకు కాగ్నిజెంట్ సంస్థ కొంతమంది ఉద్యోగుల్ని నియమించింది. ఆఫీసుకు వచ్చి పనిచేయాలంటే మంచి జీతాలు, అలవెన్సులు, సరళీకృత నిబంధనలుండాలని ఈ ఉద్యోగులు డిమాండ్ చేశారు.  ఇది గూగుల్ సంస్థకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కాగ్నిజెంట్ తరపున తన సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరిన 43 మందిని తొలగించేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ యూట్యూబ్ డేటా అనలిస్ట్ జేక్ బెనెడిక్ట్ ఈ విషయంపై అమెరికా ఆస్టిన్ సిటీ కౌన్సిల్‌కు ఆ ఉద్యోగుల తరపున ఫిర్యాదు చేశాడు. 

ఈ 43 మంది ఉద్యోగుల్ని యూట్యూబ్ మ్యూజిక్ కోసం గూగుల్-కాగ్నిజెంట్ నియమించుకున్నాయి. ఆఫీసులు వచ్చిన పనిచేయాలంటే మెరుగైన జీతభత్యాలు, ఫ్లెక్సిబుల్ రూల్స్ ఉండాలంటూ డిమాండ్ చేశారు. అయితే గూగుల్ ఈ ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరిపేందుకు గూగుల్ నిరాకరించింది. వీళ్లంతా సంస్థ ఉద్యోగులు కానందున మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పింది. ఇలా హఠాత్తుగా ఉద్యోగాల్నించి తొలగించడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బుల్లేక అద్దెలు కట్టుకోలేకపోతున్నారు. ఇది కాస్తా చాలామందిని నిరాశ్రయులుగా మార్చేస్తోంది. 

గూగుల్ మాత్రం ఉద్యోగులను తొలగించడం చేయలేదంటోంది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలతో వేర్వేలు ఒప్పందాలున్నాయని, అదే విధంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం సహజంగా ముగిసిందని గూగుల్ తెలిపింది. 

Also read: FD Interest Rates: ఎఫ్‌డీ లపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News