ఇంటిపై కూలిన హెలికాఫ్టర్.. ముగ్గురు దుర్మరణం

అమెరికాలోని ద‌క్షిణ కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్‌ ప్రాంతంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. 

Last Updated : Feb 1, 2018, 01:36 PM IST
ఇంటిపై కూలిన హెలికాఫ్టర్.. ముగ్గురు దుర్మరణం

అమెరికాలోని ద‌క్షిణ కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్‌ ప్రాంతంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. జాన్ వేన్ ఎయిర్ పోర్టు నుంచి న‌లుగురు ప్రయాణీకులతో బయల్దేరిన ఓ హెలికాఫ్టర్.. కేవ‌లం ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయాణించి ఒక్కసారిగా ఓ ఇంటిపై కుప్పకూలింది. దీంతో హెలికాఫ్టర్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు గాయపడగా.. అతడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారు. పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. 

హెలికాఫ్టర్ ఇంటిగోడకు తగలడంతో... గోడ మాత్రమే దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని, భయాందోళనలకు గురయ్యామని స్థానికులు మీడియాకు వెల్లడించారు. 

Trending News