Pfizer vaccine: ఆ వ్యాక్సిన్‌కు ఇప్పుడు హ్యాకర్ల ముప్పు

Pfizer vaccine: వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఒక ఆందోళనైతే..ఇప్పుడు మరో టెన్షన్. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లు సిద్ధమవుతున్న తరుణంలో..హ్యాకర్ల ముప్పు ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి.

Last Updated : Dec 3, 2020, 09:48 PM IST
  • కరోనా వ్యాక్సిన్ లకు ఇప్పుడు అంతర్జాతీయ హ్యాకర్ల ముప్పు
  • ముఖ్యంగా ఫైజర్ వ్యాక్సిన్ పై నిఘా పెట్టిన హ్యాకర్లు..డేటా దొంగిలించేందుకు ప్రయత్నాలు
  • ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం హెచ్చరిక
Pfizer vaccine: ఆ వ్యాక్సిన్‌కు ఇప్పుడు హ్యాకర్ల ముప్పు

Pfizer vaccine: వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఒక ఆందోళనైతే..ఇప్పుడు మరో టెన్షన్. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లు సిద్ధమవుతున్న తరుణంలో..హ్యాకర్ల ముప్పు ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి.

ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు ( Corona virus ) ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది. మరికొన్ని వ్యాక్సిన్‌లు డిసెంబర్ నాటికి రానున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ ( Covid vaccine ) పంపిణీ చేసే సంస్థలకు హ్యాకర్ల ముప్పు ( Hackers threat ) ఉందని ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం ( IBM ) హెచ్చరించింది. వ్యాక్సిన్ రవాణా చేసే సంస్థల డేటా కోసం అంతర్జాతీయ హ్యాకర్ల బృందం టార్గెట్ చేయనున్నట్టు ఐబీఎం తెలిపింది. నిపుణుల బృందం హ్యాకర్ల కదలికలపై అనుమానం వ్యక్తం చేసినట్టు ఐబీఎం స్పష్టం చేసింది.

అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యాక్సిన్ కోల్డ్ ఛైన్ ( Vaccine cold chine ) అంశంపై సమాచారం సేకరించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బృందం గుర్తించిందని ఐబీఎం వెల్లడించింది. వివిధ రకాల హైయర్ రిఫ్రిజిరేటర్ యూనిట్ల తయారీ, మోడల్ , ధరలపై హ్యాకర్ల పరిశోధన కొనసాగుతోంది. డేటా కోసం ఈ మెయిల్ రూపంలో వల విసురుతున్నారు. పక్కా ప్రణాళికతో డేటా తస్కరణ కోసం హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ మెయిల్స్ అన్నింటినీ చైనాకు చెందిన హైర్ బయోమెడికల్ సంస్థ ప్రతినిధి పేరుతో పంపుతున్నట్టు ఐబీఎం గుర్తించింది.

ఫైజర్ కంపెనీ ( Pfizer vaccine ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాలని..ట్రాన్స్‌పోర్టేషన్‌లో కూడా ఇదే మెయింటైన్ చేయాలని ఐబీఎం తెలిపింది. ఈ క్రమంలో ఫైజర్ బయోన్టెక్ కంపెనీ ( Pfizer-Biontech )లు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో పరిశీలిస్తున్నామని ఐబీఎం వెల్లడించింది.

Also read: H1B Visa: భారతీయులకు ఊరట..ట్రంప్ ఆంక్షల్ని కొట్టిపారేసిన కోర్టు

More Stories

Trending News