Covid- 19 Cases: మన దేశంలో తగ్గిన కరోనా.. డ్రాగన్ కంట్రీలో పెరుగుతున్న కేసులు

గత కొన్ని రోజులుగా కరోనా ఉదృతి మన దేశంలో తగ్గినప్పటికీ, చైనాలో మాత్రం రోజు రోజుకి విజృంభిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 10:44 AM IST
  • భారత్‌లో తగ్గిన కరోనా కేసులు
  • చైనాలో పెరుగుతున్న కేసులు
  • మళ్లీ కలవరానికి గురి చేస్తున్న కరోనా
Covid- 19 Cases: మన దేశంలో తగ్గిన కరోనా.. డ్రాగన్ కంట్రీలో పెరుగుతున్న కేసులు

Corona Cases in India: గత కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల కాలంలో రోజు 5 వేల కన్నా తక్కువ కేసులు నమోదవ్వటం కరోనా ఉదృతి తగ్గింది అనటానికి ఒక రుజువు. కాగా.. యూనియన్ హెల్త్ గవర్నమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటలలో 3,993 కోవిడ్ కేసులునమోదు అవ్వగా, 108 మంది కరోనా కారణంగా మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. 

భారత్ లో కరోనా కేసులు నమోదయ్యే సంఖ్య తగ్గినప్పటికీ. చైనాలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అవుతుంది. చైనాలో పూర్తిగా కరోనాను కట్టడి చేసి, కరోనా రహిత దేశంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ చైనా ప్రభుత్వం ఆశలకు గండి కొడుతూ.. కరోనా కేసులు అధికమవ్వటం అక్కడ ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తుంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం కరోనా కేసులు అధికమవ్వటం అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి సవాల్ గా మారింది. 

చైనా దేశంలో పలు నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత రెండు రోజులుగా మార్చి 2020 లో కన్నా అధికంగా కేసులు నమోదవ్వటాన్ని గమనించవచ్చు. చైనాలో సోమవార్మ 214 కరోనా కేసులు నమోదవ్వగా, ఆదివారం రోజు 312 కేసులు నమోదు అవ్వటంతో ప్రభుత్వం చైనా అప్రమత్తమంది. 

చైనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షాన్‌ డాంగ్ ప్రావిన్స్, జిలిన్, గ్వాంగ్‌ డాంగ్ నగరాల్లో అధిక మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకి వస్తే.. చైనాలో దాదాపు 80 శాతం వరకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. 

ఇక మన దేశంలో కరోనా ఉధృతి తగ్గినప్పటికీ, యాక్టివ్ కేసులు సంఖ్య 49,948 ఉండగా.. ఇప్పటి వరకి కరోనా కారణంగా భారత్ లో 5,15,210 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 21,34,463 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. ఇప్పటి వారికి 1,79,13,41,29 మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News