'ఫేస్‌బుక్'కి షాక్: ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్స్ రాజీనామా

'ఫేస్‌బుక్'కి షాక్: ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్స్ రాజీనామా

Last Updated : Sep 25, 2018, 02:16 PM IST
'ఫేస్‌బుక్'కి షాక్: ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్స్ రాజీనామా

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకులైన మైక్ క్రెయిజర్, కెవిన్ సిస్ట్రోమ్‌లు ఫేస్‌బుక్‌కి వీడ్కోలు పలకనున్నారు. మరికొన్ని వారాల్లో ఫేస్‌బుక్‌‌ను వీడనున్నట్లు చెప్పారు. 'ఫోటో షేరింగ్ యాప్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌ వ్యవస్థాపకులైన కెవిన్ సిస్ట్రోమ్, మైక్‌ క్రీజర్‌లు ఫేస్‌బుక్‌కు వీడ్కోలు చెప్పనున్నారు. ప్రస్తుతం వీరు ఇన్‌స్టాగ్రామ్ సీఈఓగా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ పదవుల్లో ఉన్నారు. ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్ని వారాల్లో వీరిద్దరూ కంపెనీని వీడనున్నారు' అని న్యూయార్క్ టైమ్స్ సోమవారం తెలిపింది. అయితే వారు కంపెనీని ఎందుకు వీడుతున్నారో కారణం చెప్పలేదని పేర్కొంది.

రాజీనామాలపై సిస్ట్రోమ్‌ స్పందించారు. తమ ఉత్సుకత, సృజనాత్మకతను మరోసారి వెలికితీయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌కు మధ్య నాయకత్వ విషయంలో విభేదాలు వచ్చినట్టు అందుకే, వీరు రాజీనామా చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌కు, సిస్ట్రోమ్‌కు పలుమార్లు విభేదాలు వచ్చాయని పేర్కొన్నాయి.

రాజీనామాలపై ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ స్పందించారు. ‘కెవిన్‌, మైక్‌ అద్భుతమైన ప్రొడక్ట్‌ లీడర్లు.. ఇన్‌స్టాగ్రామ్‌ వారి సృష్టే. గత ఆరేళ్లలో వారి వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను.. బాగా ఎంజాయ్‌ చేశాను. వారికి ఆల్‌ ది బెస్ట్‌. వాళ్లు తర్వాత ఏం చేస్తారో చూడాలి’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

కాగా, ఒక బిలియన్ డాలర్లు పెట్టి ఫేస్‌బుక్‌ 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను కొనింది. ఇన్‌స్టాగ్రామ్‌ను 2010లో స్థాపించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. కొత్త కొత్త ఫీచర్లు వస్తుండటం, ఎక్కువ మంది ప్రముఖులు దీన్ని వాడటంతో దీనికి మరింత క్రేజ్ పెరిగింది.

Trending News