Israel Iran War: పచ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజు రోజుకి పెరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య దాడులు ప్రతి దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్‌పై సైనిక చర్యను జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించగా, మరోవైపు ఈ దాడిపై ఇరాన్ నుండి తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సెమీ-అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ ఒక వార్తను రిపోర్ట్ చేయగా, అందులో ఇరాన్ ఎటువంటి దాడిపై అయినా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ దాడికి ఇజ్రాయెల్ తీవ్రమైన ప్రతిస్పందనను ఎదుర్కోవలసి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్‌లో విమానాల రాకపోకలపై నిషేధం:
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడులు నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని విమానాలను నిషేధించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని మార్గాల్లో విమానాలను రద్దు చేసినట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు, ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ IRNA విషయాన్ని పేర్కొంది. ఇరాన్ ఇజ్రాయెల్‌పై ఎప్పుడైనా ప్రతీకారం తీర్చుకోగలదని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఇరాన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని, అయితే కొన్ని చోట్ల పరిమిత నష్టం వాటిల్లిందని చెప్పారు. టెహ్రాన్, ఖుజెస్తాన్ ఇలామ్ ప్రావిన్సులలోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్ మళ్లీ ఎలాంటి తప్పు చేయాలన్నా భయపడాలి: ఇజ్రాయెల్
మరోవైపు, ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడులు పూర్తయిన తర్వాత, IDF ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఒక ప్రకటనలో ఇరాన్ తీవ్రతరం చేసే తప్పు చేస్తే, ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. "ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు మేము ఇజ్రాయెల్ బదులు ఇచ్చామన్నారు. మేము ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై లక్ష్యంగా దాడులు చేసాము - ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమ లక్ష్యాన్ని పూర్తి చేశాయి." అన్నారు. ఇరాన్ పాలకులు మరోసారి తప్పులకు పాల్పడితే, మేము తీవ్రంగా స్పందించవలసి వస్తుందని ఇజ్రాయెల్ సైనికాధికారులు పేర్కొన్నారు.
ఇరాన్‌లోని క్షిపణి తయారీ ప్లాంట్లు ఇతర సైట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్‌లో దాడులు చేసిన తర్వాత, దాని విమానాలు సురక్షితంగా తిరిగాయి. గత ఏడాది ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తయారు చేయడానికి ఉపయోగించే క్షిపణి తయారీ ప్లాంట్లపై తమ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. ఇరాన్ వైమానిక సామర్థ్యాలపై కూడా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
Israel Iran War: ఇజ్రాయెల్ దాడులకు బిత్తరపోయిన ఇరాన్..మెరుపుదాడులకు బదులిస్తామని హెచ్చరిక