ట్రంప్, జుకర్ బర్గ్‌ల మధ్య కోల్డ్ వార్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ సంస్థ ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు.ట్రంప్ ఫేస్ బుక్ సంస్థను విమర్శిస్తూ, ఈ సోషల్ మీడియా సంస్థ ఎప్పుడూ తనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఎల్లో జర్నలిజంతో కూడిన వార్తలు ప్రచురించడం, పక్షపాత వైఖరి చూపించడం ఫేస్ బుక్ నైజమని తెలియజేశారు. సాధారణంగా 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్రపై కూడా ఫేస్ బుక్ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిందని, సాధారణంగా ఏదైనా నచ్చని వార్తా సమాచారం వైరల్ అవుతున్నప్పుడు కొన్న వర్గాలు అసంతృప్తికి గురవుతాయని, ట్రంప్ ప్రభుత్వం కూడా అలాగే అసంతృప్తి చెందిందని, ఎవరైనా తమ సంస్థ గురించి తమ భావాలను పంచుకోవచ్చని జుకర్ బర్గ్ తెలిపారు. 

Last Updated : Sep 29, 2017, 10:59 AM IST
ట్రంప్, జుకర్ బర్గ్‌ల మధ్య కోల్డ్ వార్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ సంస్థ ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు.ట్రంప్ ఫేస్ బుక్ సంస్థను విమర్శిస్తూ, ఈ సోషల్ మీడియా సంస్థ ఎప్పుడూ తనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఎల్లో జర్నలిజంతో కూడిన వార్తలు ప్రచురించడం, పక్షపాత వైఖరి చూపించడం ఫేస్ బుక్ నైజమని తెలియజేశారు. సాధారణంగా 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్రపై కూడా ఫేస్ బుక్ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిందని, సాధారణంగా ఏదైనా నచ్చని వార్తా సమాచారం వైరల్ అవుతున్నప్పుడు కొన్న వర్గాలు అసంతృప్తికి గురవుతాయని, ట్రంప్ ప్రభుత్వం కూడా అలాగే అసంతృప్తి చెందిందని, ఎవరైనా తమ సంస్థ గురించి తమ భావాలను పంచుకోవచ్చని జుకర్ బర్గ్ తెలిపారు. 

 

Trending News