Corona Lockdown: ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 347,282,797 కరోనా కేసులు (World wide Corona cases) నమోదయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 276,824,461 మంది కరోనాను జయించారు. 5,604,853 మంది కొవిడ్‌కు (Corona deaths World wide) బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా 64,853,183 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
అమెరికా, యూరప్ వంటి దేశాల్లో రోజు వారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
ప్రపంచంపై కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమై రెండేళ్లు దాటినా.. కొన్ని చిన్న చిన్న దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేకుండా సురక్షితంగా ఉన్నాయి. తాజా కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఆ దేశాలను కూడా వదలలేదు.
ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వల్ల.. పలు చిన్న చిన్న దేశాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా పసిఫిక్ దీవుల్లోని కిరిబాటి, సమోవా దేశాలను కరోనా భయాలు వణికిస్తున్నాయి. కిరిబాటిలో ఒక్క కేసులు కూడా నమోదు కాకపోయినా.. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మందికి పాజిటివ్‌గా తేలడంతో.. నేపథ్యంలో లాక్డౌన్ విధించింది (Lock down in Oceania Countries ) స్థానిక యంత్రాంగం.
ఇక సమోవా ద్వీపంలో రెండు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తత చర్యలు ప్రారంభించింది. అత్యవసర సేవలు మినహా ఇతర సేవలను ఇతర అన్ని సేవలపై తాత్కాలికంగా ఆంక్షలు (Lock down in Samoa) విధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook