భారత దేశంతో మినహా భారతీయలు అధికంగా ఉండే ప్రదేశం ఏదైన ఉందంటే అది ఒక్క యూఏఈ అనే చెప్పాలని యూఏఈ భారత రాయభారీ నవదీప్ సూరీ అభిప్రాయపడ్డారు. ఇక్కడ 33 లక్షల భారతీయులు ఉన్నారని..భారతీయలను కూడా తమ తమ దేశ పౌరలువలే యూఏఈ ఆదిరిస్తోందని కొనియాడారు. దక్షిణాసియా అభివృద్ధి మరియు భవిష్యత్తు అవకాశాలే ప్రధాన అంశంగా జీ న్యూస్ అంతర్జాతీయ ఛానల్ WION దుబాయ్ వేదికగా Unleashing the Power of South Asia పేరుతో ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నవదీప్ సూరీ తనదైన శైలిలో ప్రసంగించారు
అమెరికా తర్వాత భారత్...
ఇదే సందర్భంలో ఇరుదేశాల వ్యాపార సంబంధాలపై నవదీప్ సూరీ స్పందించారు. ఇరుదేశాల మధ్య గత ఏడాది 55 మిలియన్ డాలర్ల వరకు లావాదేవీలు జరిగాయంటే భారత్-యూఏఈ ఆర్ధిక సంబంధాలు ఎంత మెరుగ్గా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అమెరికా తర్వాత యూఏఈతో ఎక్కవ వ్యాపారం చేసే దేశంగా భారత్ నిలుస్తుందన్నారు
భారత్ సాంప్రదాయాలకు గుర్తింపు
భారత ఆచార సాంప్రదాయాలను గౌరవించడం..ఇక్కడ హిందు మందిలాలు ఏర్పాటుకు సహకరించడం.. అలాగే ఖైదీల మార్పిడి పరస్పర అవగాహనతో ఉండటం వంటి అంశాలు భారత్ - యూఏఈ సంబంధాలు ఎంత మెరుగ్గా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని నవదీప్ పేర్కొన్నారు.
బుర్జ్ ఖలీఫాలో మహాత్మాగాంధీ...
దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖాలీఫాలాంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన భవనంలో మహాత్మా గాంధీ యొక్క చిత్రం ఉండటం.. భారత్ పట్ల యూఏఈ ఎంత సామరస్యంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చని నవదీప్ సూరి ఈ సందర్భంగా వ్యాక్యానించారు