No Tobacco Day 2023 Theme: నేడే ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం..ఈ సంవత్సరం థీమ్‌ ఇదే!

No Tobacco Day 2023 Theme: ప్రతి సంవత్సరం మే 31వ తేదిన "ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం" జరుపుకుంటారు. ఈ రోజు పొగాకు వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అయితే ఈ సంవత్సరం పొగాకు నిరోధక దినోత్సవం థీమ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 31, 2023, 10:40 AM IST
No Tobacco Day 2023 Theme: నేడే ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం..ఈ సంవత్సరం థీమ్‌ ఇదే!

No Tobacco Day 2023 Theme: పోగాకు వల్ల కలిగే నష్టాన్ని అందరికి తెలిపేందుకు  అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం "ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం" జరుపుకుంటారు. ఈ  దినోత్సవం ప్రతి సంవత్సవరం మే 31వ తేదిన జరుపుకుంటారు. పొగాకును విచ్చలవిడిగా వినియోగించడం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల మంది ప్రజలు చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. 

పొగాకు వినియోగించడం వల్ల మరణిస్తున్న ప్రజలు దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం "ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం" జరపాలని అన్ని దేశాల ప్రజలకు WHO సూచిస్తోంది. అంతేకాకుండా ఈ రోజు ప్రతి సంవత్సరం లాగే ఈ దినోత్సవ థీమ్‌ను కూడి విడుదల చేసింది.

ఈ సంవత్సరానికి గాను థీమ్ "మనందరికీ కేవలం ఆహారం మాత్రమే కావాలి, పొగాకు కాదు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ థీమ్‌ ప్రత్యేకత..బ్రతకడానికి కేవలం ఆహారం మాత్రమే కావాలని, పొగాకు వద్దని సూచిస్తోంది.

ప్రతి సంవత్సరం పొగాకు వినియోగించడం వల్ల మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణించిందని సమాచారం. ఆ తర్వాత అన్ని దేశాలు  1988లో మొదటిసారిగా ఏప్రిల్‌లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతూ వచ్చాయి. 

Also read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..

పొగాకును వినియోగించడం హానికరమని తెలిసినప్పటికీ చాలా మంది దీనిని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో చాలా మంది పొగాకు వినియోగించడం వల్ల అవగాహన లేని కారణంగా మత్తుకు అలవాటు అవుతున్నారని సమాచారం. దీని కారణంగా నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. 

పొగాకు వినియోగించడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో అందరికీ అవగాహన కల్పించడం వల్ల సులభంగా పొగాకును వినియోగం తగ్గించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా యువతలో మార్పులు తీసుకువస్తే భావి తరానికి మేలు చేసివారవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Also read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News