Omicron Virus Scotland: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడు అనేక దేశాలకు పాకింది. కరోనా వేరియంట్ డెల్టా కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లకు ఈ మహమ్మారి విస్తరించింది.
ఇప్పుడా వైరస్ యూకేలో భాగమైన స్కాట్లాండ్ దేశంలో వెలుగు చూసినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే యూకే పరిధిలో ఒమిక్రాన్ కేసులు మూడు నమోదు కాగా.. తాజాగా స్కాట్లాండ్లో ఆరుగురిలో ఈ వేరియంట్ వెలుగుచూడటం వల్ల.. యూకేలో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి పెరిగింది.
ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంటాక్టు ట్రేసింగ్ చేపట్టాలని ప్రజారోగ్య విభాగం అధికారుల్ని ఆదేశించింది. ఈ కొత్త వేరియంట్ గురించి మరింత సమాచారం తెలిసేదాకా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్కాట్లాండ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి హమ్జా యూసఫ్ హెచ్చరించారు.
బ్రిటన్‌లో మూడు కేసులు నమోదు కావడం వల్ల ఇప్పటికే అప్రమత్తమైన బ్రిటిష్ ప్రభుత్వం.. తమ దేశంలోకి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించడం సహా ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది.
ఒమిక్రాన్ వ్యాపించిన దేశాలివే..
దక్షిణాఫ్రికా, బోట్స్వానా, కెనడా, యూరప్‌లోని నెదర్లాండ్స్, బెల్జియం, బ్రిటన్, స్కాట్లాండ్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్‌తో పాటు ఇజ్రాయెల్ తో పాటు ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని హాంగ్‌కాంగ్, ఆస్ట్రేలియాలలో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.
Also Read: Cyril Ramaphosa: 'మా దేశంపై వివక్ష సరికాదు- వెంటనే ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయాలి'
Also Read: Peru Earthquake: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook