Congo Boat Capsize: కాంగో నదిలో ఘోర పడవ ప్రమాదం...100 మంది మృతి!

Boat capsized in congo river: కాంగో నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న బోటు నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 10:52 AM IST
  • కాంగోలో ఘోర దుర్ఘటన
  • పడవ బోల్తా పడి..100 మంది మృతి
  • 61 మృతదేహాలు లభ్యం
Congo Boat Capsize: కాంగో నదిలో ఘోర పడవ ప్రమాదం...100 మంది మృతి!

Congo Boat Capsize: కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందడమో, గల్లంతవడమో జరిగిందని అధికారులు శనివారం తెలిపారు. గత సోమవారం రాత్రి మొంగాలా(Mongala)లోని బుంబా(Bumba) పట్టణానికి సమీపంలో కాంగో నది(congo river)లో ఈ దుర్ఘటన(Congo Boat Accident) జరిగిందని చెప్పారు.

ఒకదానికి మరొకటి కలిపి ఉన్న 9 పడవలు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ పడవలు బోల్తా పడ్డాయని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా 61 మృతదేహాలు లభ్యమయ్యాయని మొంగాలా రాష్ట్ర రవాణా మంత్రి జోస్ మిసిసో వెల్లడించారు. చిన్నారులు, మహిళలు సహా 100 మందికి పైగా గల్లంతైనట్లు చెప్పారు. 30 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు. కనిపించకుండా పోయినవారికోసం గాలింపు చర్యలు ప్రారంభించారు అధికారులు.

Also Read: US Nuclear Submarine: యూఎస్ అణు జలాంతర్గామికి ప్రమాదం, చైనా ఆందోళన

తరచు ప్రమాదాలు
కాంగోలో పడవ ప్రమాదాలు(Congo Boat Accident) తరుచు జరుగుతుంటాయి. సామర్థ్యానికి మించి నదిలో పడవలు ప్రయాణించడమే ఇందుకు ప్రధాన కారణం. కాంగోలో రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడం వల్ల చాలా మంది.. నదీ మార్గాలను ఆశ్రయిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, మై-ఎన్‌డొంబే ప్రావిన్స్‌లోని కాంగో నదిలో పడవ బోల్తాపడింది. ఇందులో 60 మంది మరణించారు. ప్రయాణికులను అతిగా ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

2010లో పడవ బోల్తాపడి 135 మంది మరణించారు. జనవరి 2021లో..కివు సరస్సులో ప్రయాణికుల పడవ మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. అదే విధంగా ఇదే సరస్సులో మే నెలలో మరో పడవ బోల్తాపడి 8 ఏళ్ల బాలికతో సహా 10 మంది మరణించారు. 2010 జూలైలో, పశ్చిమ ఫ్రావిన్స్ బందుండులో పడవ బోల్తా పడడంతో 135 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News