Oxygen Tankers: దేశంలో కరోనా మహమ్మారి తారాస్థాయిలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ దేశంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. ఆక్సిజన్ లేక విలవిల్లాడుతున్న దేశానికి విదేశాల్నించి ఆక్సిజన్ అందుతోంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second wave)ప్రతాపానికి ఇండియా చిగురుటాకులా వణికిపోతోంది.దేశంలో ఆక్సిజన్, బెడ్స్, వెంటిలేటర్స్, మందుల కొరత తీవ్రమైంది.ఆఖరికి స్మశానంలో స్థలం కూడా దొరకడం లేదు కొన్ని ప్రాంతాల్లో. ప్రతిరోజూ 3.5 లక్షల కేసులు నమోదవుతుండటంతో పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. ఆక్సిజన్ అందని ( Oxygen Shortage) రోగుల్ని ఆసుపత్రుల చుట్టూ తిప్పుతూ నానా అవస్థలు పడుతున్నారు. కొందరి ప్రాణాలు మార్గమధ్యలోనే పోతున్నాయి.ఈ నేపధ్యంలో ఇండియాకు సహాయం అందించేందుకు ఇప్పటికే సౌదీ అరేబియా, కువైట్, ఫ్రాన్స్, అమెరికా, యూకే, సింగపూర్, బ్యాంకాక్ దేశాలు ముందుకొచ్చాయి. ఆక్సిజన్, కాన్సంట్రేటెడ్ ఆక్సిజన్ పరికరాలు, బైపాప్ , వైద్య పరికరాలు, మందులు అన్నీ సరఫరా చేస్తున్నాయి.
ఈ క్రమంలో థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్(Bangkok) నుంచి భారత్‌కు నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లు (Oxygen Tankers)చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇవి గుజరాత్‌లోని జామ్ నగర్‌కి బుధవారం సాయంత్రం చేరుకున్నాయి. మరోవైపు సింగపూర్ (Singapore) నుంచి రెండు సీ–130 ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా 256 ఆక్సిజన్ సిలిండర్లు పశ్చిమబెంగాల్లోని పనాగఢ్‌కు చేరుకున్నా యి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక ఇండియా తల్లడిల్లుతున్న నేపధ్యంలో యుద్ధ విమానాలతో ట్యాంకర్లు తరలిస్తున్నారు. అంతేగాక దేశంలో సైతం పలు ప్రాంతాల మధ్య కూడా యుద్ధ విమానాలను ఉపయోగించి ట్యాంకర్లను తరలిస్తున్నారు. ఆగ్రా, హిందోన్, భోపాల్, చండీగఢ్‌ల నుంచి ఒక్కో సిలిండర్ చొప్పున రాంచీకి తరలిం చారు. అవేగాక ఇండోర్ నుంచి రాయ్‌పూర్‌కు రెండు ట్యాంకర్లు, జోధ్‌పూర్ నుంచి జామ్ నగర్‌కు రెండు ట్యాంకర్లు తరలించారు.
Also read: Covid Virus Spread: ఆ రెండు వ్యాక్సిన్లలో ఒక్క డోసు పడినా చాలు..సంక్రమణ తగ్గుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook