పాకిస్తాన్‌లో కొత్త న్యూక్లియర్ ఆయుధాలు..!

పాకిస్తాన్ సరికొత్త న్యూక్లియర్ ఆయుధాలకు రూపకల్పన చేయాలని చూస్తుందని.. అదే గనుక జరిగితే ఆ దేశ సరిహద్దు ప్రాంతాలకు తీవ్రమైన ముప్పు సంభవించే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 

Last Updated : Feb 14, 2018, 03:38 PM IST
పాకిస్తాన్‌లో కొత్త న్యూక్లియర్ ఆయుధాలు..!

పాకిస్తాన్ సరికొత్త న్యూక్లియర్ ఆయుధాలకు రూపకల్పన చేయాలని చూస్తుందని.. అదే గనుక జరిగితే ఆ దేశ సరిహద్దు ప్రాంతాలకు తీవ్రమైన ముప్పు సంభవించే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జమ్ము, కాశ్మీర్‌లో సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేసిన రెండు రోజుల తర్వాత పాకిస్తాన్ జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికాలోని సెనేట్ సెలక్షన్ కమిటీ మీటింగ్‌‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ తయారు చేయాలని భావిస్తున్న ఆయుధాల్లో  న్యూక్లియర్ ఆయుధాలతో పాటు షార్ట్ రేంజ్ టాక్టికల్ ఆయుధాలు, క్రూజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని డాన్కో ట్స్ తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు పాకిస్తాన్ చేయడం వల్ల ఆ దేశ భద్రతతో పాటు ఆ దేశ సరిహద్దు దేశాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఉత్తర కొరియా పలు న్యూక్లియర్ ఆయుధాలను ఇరాన్, సిరియాకి సప్లై చేస్తుందని... ఆ విధంగా ప్రమాదకరమైన సంకేతాలు పంపుతున్నదని కోట్స్ అన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ ఆయుధాల ప్రయోగాలు చేసేందుకు ముందుకు రావడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. 

Trending News