Lahore Bomb Blast: పాకిస్తాన్ లాహోర్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

Pakistan Lahore Bomb Blast: పాకిస్తాన్‌లోని లాహోర్‌‌లో గురువారం (జనవరి 20) బాంబు పేలుడు చోటు చేసుకుంది. పేలుళ్ల ధాటికి ముగ్గురు మృతి చెందగా దాదాపు 20 మంది గాయపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 06:33 PM IST
  • పాకిస్తాన్‌లోని లాహోర్‌లో బాంబు పేలుడు
  • పేలుడు ఘటనలో ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
  • గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమం
Lahore Bomb Blast: పాకిస్తాన్ లాహోర్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

Pakistan Lahore Bomb Blast: పాకిస్తాన్‌లోని లాహోర్‌‌లో గురువారం (జనవరి 20) బాంబు పేలుడు చోటు చేసుకుంది. పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 20 మంది గాయపడ్డారు. లాహోర్‌లో నిత్యం రద్దీగా ఉండే అనార్కలీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. షాపుల ఎదుట పార్క్ చేసి ఉన్న బైక్స్ మంటల్లో దగ్ధమయ్యాయి

లాహోర్ డిప్యూటీ కమిషనర్ ఉమెర్ షేర్ మాట్లాడుతూ.. అనార్కలీ బజార్‌లోని చివరి లైన్‌లో పేలుడు చోటు చేసుకుందన్నారు. అక్కడి ఓ బ్యాంకు ముందు పార్క్ చేసిన బైక్‌లో బాంబును అమర్చినట్లు గుర్తించామన్నారు. పేలుడు ఘటనలో గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.  డీఐజీ అబిద్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ ఆధారాలు సేకరిస్తోందన్నారు. టెక్నికల్ టీమ్ అనలిసిస్ ఆధారంగా పేలుడు ఘటనపై మరింత స్పష్టత వస్తుందన్నారు.

ఘటనపై స్పందించిన పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్... దీనిపై సమగ్ర విచారణ జరపాలని పోలీస్ శాఖను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా ఈ ఘటన జరిగిందని.. బాధ్యులు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేలుడు ఘటనను (Bomb Blast) ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.. ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Also Read: Three Eyed Calf Died: మూడు కళ్లతో జన్మించిన వింత లేగదూడ మృతి.. పుట్టిన వారం రోజులకే!

Also Read: India Covid Cases Today: దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు- పెరిగిన మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News