Pakistan Mysterious Disease: పాకిస్థాన్‌లో వింత వ్యాధి కలకలం రేపుతోంది. కరాచీ నగరంలో 18 మంది ప్రాణాలు బలిగొంది. మృతుల్లో 14 మంది చిన్నారులు ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమానీ శుక్రవారం ధృవీకరించారు. జనవరి 10 నుంచి 25వ తేదీ మధ్య కెమారిలోని మావాచ్ గోత్ ప్రాంతంలో ఈ మరణాలు సంభవించాయని ఆయన చెప్పారు. దక్షిణ పాకిస్థాన్ పోర్ట్ సిటీలో ఆరోగ్య అధికారులు ఇప్పటికీ మరణాలకు కారణాన్ని కనిపెట్టలేకపోయారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌ను అంతుచిక్కని వ్యాధిని కలవరపెడుతోంది.
మవాచ్ గోత్ అనేది మురికివాడల ప్రాంతం. ఇక్కడ ప్రజలు ఎక్కువగా రోజువారీ కూలీ కార్మికులు, మత్స్యకారులు. 'ఈ మరణాలకు గల కారణాన్ని ఆరోగ్య బృందం పరిశోధిస్తోంది. ఈ మరణాలు జరిగిన గోత్ తీర ప్రాంతంలో ఉన్నందున ఇది సముద్రం లేదా నీటికి సంబంధించినదని మేం అనుమానిస్తున్నాము. చనిపోయేముందు తీవ్ర జ్వరం, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లుట్లు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతంలో వింత వాసన వస్తోందని కొందరు ఫిర్యాదు చేశారు..' అని హమీద్ జుమానీ తెలిపారు.
సింధ్ సెంటర్ అధిపతి ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ.. పరిశ్రమల నుంచి సోయాబీన్ కొన్ని నమూనాలను సేకరించామని తెలిపారు. సోయా అలెర్జీ కూడా కారణమని తాము భావిస్తున్నానని చెప్పారు. గాలిలోని సోయాబీన్ దుమ్ము రేణువులు కూడా తీవ్ర అనారోగ్యాలకు, మరణాలకు కారణమవుతాయన్నారు. అయితే తాము ఇంకా ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదని.. నమూనాలను పరీక్షిస్తున్నామని వెల్లడించారు.
Also Read: 7th Pay Commission: కేంద్రం ఈ మూడు ప్రకటనలు చేస్తే ఉద్యోగులకు పండగే.. బడ్జెట్‌పైనే ఆశలన్నీ..
Also Read: IND Vs NZ: శుభ్‌మన్ గిల్ Vs పృథ్వీ షా.. హార్ధిక్ పాండ్యాను ఆడుకుంటున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook