Pakistan Banned TikTok: చైనాకు షాకిచ్చిన పాకిస్తాన్, టిక్‌టాక్‌ బ్యాన్!

పాకిస్తాన్ ( Pakistan ) తన మిత్రదేశం చైనాకు ( China) షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ బ్యాన్ చేసింది. 

Last Updated : Oct 9, 2020, 07:18 PM IST
    • పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాకు షాక్ ఇచ్చింది.
    • చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ బ్యాన్ చేసింది.
    • సమాజంలోని భిన్న వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ ఆధారిటీ తెలిపింది
Pakistan Banned TikTok: చైనాకు షాకిచ్చిన పాకిస్తాన్, టిక్‌టాక్‌ బ్యాన్!

పాకిస్తాన్ ( Pakistan ) తన మిత్రదేశం చైనాకు ( China) షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ బ్యాన్ చేసింది. సమాజంలోని భిన్న వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ ఆధారిటీ తెలిపింది. అనైతికంగా, ఎబ్బెట్టుగా, అసభ్యంగా అనిపించే వీడియోలకు టిక్‌టాక్‌ వేదికగా మారింది అని అందుకే బ్యాన్ చేసినట్టు సమాచారం అందించింది.

ALSO READ|  Video: మాస్కు వేసుకోవడం మనం చేసే సాధారణ తప్పులపై WHO వీడియో 

టిక్‌టాక్‌ను ( TikTok ) బ్యాన్ చేయడానికి ముందే పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ ఆధారిటీ యాప్ తయారీదారులకు ఫైనల్ నోటీసులు అందించింది. వీడియో షేరింగ్ యాప్ అయిన 
టిక్‌టాక్‌లో వస్తున్న అనైతిక, అసభ్యకరమైన కంటెంట్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపని కోరింది.

దానికి తగిన సూచనలు కూడా జారీ చేసింది. కానీ పీటీఏ ( Pakistan Telecommunication Authority ) సూచనలు అమలు చేయడంలో టిక్‌టాక్‌ విఫలం అయింది. దీంతో యాప్ బ్యాన్ చేసే ప్రక్రియను మొదలుపెట్టినట్టు తెలిపింది. 

ALSO READ| Own Business: తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల వ్యాపారంHome Making : బల్లులతో ఇబ్బందా.. ఇలా చేయండి

ఇక టిక్‌టాక్‌ సంస్థకు మరో అవకాశం కల్పిస్తూ వారు ఎలాంటి మార్పులను ప్రస్తావనకు తీసుకురానున్నారో పరిశీలించి.. వాటిని పరిగణలోకి తీసుకుని బ్యాన్ కొనసాగించాలా లేదా ఎత్తివేయాలో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపంది పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ ఆధారిటీ.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News