PM Narendra Modi Russia Tour: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు. రష్యాలోని కజాన్ వేదికగా 16వ బ్రిక్స్ సమ్మిట్ జరుగనుంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ సమ్మిట్ లో ప్రధాని మోడీ.. బ్రిక్స్ దేశాధినేతలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. భవిష్యత్ సహకారంకోసం ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు నెలల్లో రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై నెలలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత మాస్కోలో ప్రధాని మోదీ తొలిసారి పర్యటించారు.
2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్ గా రూపొంతారం చెందింది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా బ్రిక్స్ లో సభ్య దేశాలుగా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter